ప్రెగ్నెన్సీ రూమర్స్‌.. స్పందించిన అక్కినేని కొడలు! | Sobhita Dhulipala Response On Pregnancy Rumours | Sakshi
Sakshi News home page

ప్రెగ్నెన్సీ రూమర్స్‌.. స్పందించిన అక్కినేని కొడలు!

May 8 2025 10:24 AM | Updated on May 8 2025 11:21 AM

Sobhita Dhulipala Response On Pregnancy Rumours

శోభిత-నాగ చైతన్య (Photo: Instagram/Sobhita Dhulipala)

ఈ మధ్య టాలీవుడ్‌ స్టార్స్‌పై ప్రెగ్నెన్సీ పుకార్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొత్తగా పెళ్లైయిన జంటలపై ఏడాదిలోపే ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల అటు మెగా కోడలు లావణ్య త్రిపాఠి, ఇటు అక్కినేని కోడలు శోభితా దూళిపాళ(Sobhita Dhulipala )పై ఇలాంటి పుకార్లే వచ్చాయి. ఇద్దరూ కూడా త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. అయితే వీరిలో లావణ్య త్రిపాఠి నిజంగానే గర్భం దాల్చారు. 

ఈ విషయాన్ని ఇటీవల వరుణ్‌ తేజ్‌-లావణ్య జంట అధికారికంగా ప్రకటించింది. అయితే శోభిత గురించి వినిపించిన ‘గుడ్‌ న్యూస్‌ ’మాత్రం ఒట్టి పుకారు మాత్రమే. శోభిత పర్సనల్‌ లైఫ్‌ గురించి వినిపిపస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె టీమ్‌ ప్రకటించింది. ప్రస్తుతం శోభిత తన వైవాహిక జీవితం ఆస్వాదిస్తోందని, మాతృత్వంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీమ్‌ స్ఫస్టం చేసింది. 

కాగా, సమంతతో విడాకుల తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉన్న నాగచైతన్య..గతేడాది ఆగస్ట్‌లో శోభితా దూళిపాళను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత శోభిత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్‌ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌ని పలకరిస్తోంది. ఇక నాగచైతన్య పెళ్లి తర్వాత ‘తండేల్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం కార్తీక్‌ దండు దర్శకత్వంలో ఓ మైథాలాజికల్‌ థ్రిల్లర్‌ సినిమా  చేస్తున్నాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement