Sobhita Dhulipala Wedding Pics Amid Dating Rumours With Tollywood Hero Goes Viral - Sakshi
Sakshi News home page

Sobhita Dhulipala : ఆ హీరోతో డేటింగ్‌? పెళ్లి ఫోటోలతో షాక్‌ ఇచ్చిన 'మేజర్‌' బ్యూటీ

Nov 3 2022 3:43 PM | Updated on Nov 3 2022 4:50 PM

Sobhita Dhulipala Post Wedding Pics Amid Dating Rumours With Tollywood Hero - Sakshi

మేజర్‌, గూఢచారి సినిమాలతో అలరించిన నటి శోభిత ధూళిపాల. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ‍బ్యూటీ రీసెంట్‌గా మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలో నటించింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న శోభిత ఓ ప్రముఖ టాలీవుడ్‌ హీరోతో ప్రేమలో ఉందంటూ కొద్ది రోజులుగా రూమర్స్‌ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా పెళ్లి దుస్తుల్లో కనిపించి అందరికి షాక్‌ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఓ వ్యక్తితో చేతిలో చెయ్యేసి పెళ్లి కూతురిలా అందంగా ముస్తాబైంది. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా శోభిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. వెడ్డింగ్స్‌ ఇన్‌ దుబాయ్‌ అని క్యాప్షన్‌ ఇవ్వడంతో నిజంగానే శోభితకు పెళ్లయిపోయిందా అంటూ నెటిజన్లు సందేహం వ్యక్తం చేశారు.

అయితే ఇందులో నిజం లేదని తెలిసిపోయింది. ఇవి పెళ్లికి సంబంధించి ఓ యాడ్‌ షూట్‌లో భాగంగా తీసిన ఫోటోలట. ఈ క్రమంలో శోభిత అభిమాని ఒకరు ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పనైంది అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం శోభిత షేర్‌ చేసిన ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement