భారీ పారితోషికం డిమాండ్‌ చేస్తున్న విలన్‌! | SJ Suryah Shocking Remuneration | Sakshi
Sakshi News home page

SJ Suryah: రెమ్యునరేషన్‌ ఓ రేంజ్‌లో అడుగుతున్న విలన్‌, ఎంతంటే?

Feb 7 2022 1:01 PM | Updated on Feb 7 2022 1:30 PM

SJ Suryah Shocking Remuneration - Sakshi

'స్పైడర్‌' సినిమా పెద్దగా ఆడకపోయినా ఇందులో విలన్‌గా పాత్ర పోషించిన ఎస్‌జే సూర్య నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తాజాగా అతడు భారీగా డిమాండ్‌ చేస్తున్నాడట..

విలన్లు అంటేనే భయపెట్టేవాళ్లు. సినిమాల్లో హీరోహీరోయిన్లను, మంచివాళ్లను భయపెడుతుంటారు. కానీ కొన్ని సినిమాల్లో నటించిన విలన్లు మాత్రం ప్రేక్షకులను సైతం గజగజలాడించారు. వాటిలో 'స్పైడర్‌' మూవీ ఒకటి. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా ఇందులో విలన్‌ పాత్ర పోషించిన ఎస్‌జే సూర్య నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

సూర్య నటుడు మాత్రమే కాదు దర్శకుడు, రచియత, నిర్మాత కూడా! తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ నటుడికి ఇటీవలే టాలీవుడ్‌ నుంచి ఓ మంచి ఆఫర్‌ అతడి తలుపు తట్టిందట. కానీ సూర్య తనకు రూ.7 కోట్ల పారితోషికం ఇస్తేనే సినిమా చేస్తానని చెప్పడంతో నిర్మాతు ఖంగు తిన్నట్లు సమాచారం. ఇంతకీ సూర్యకు ఏ మూవీలో ఛాన్స్‌ వచ్చింది? అతడు ఆ ప్రాజెక్ట్‌కు ఓకే అయ్యాడా? లేదా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement