breaking news
SJ Suriya Villain
-
భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్న విలన్!
విలన్లు అంటేనే భయపెట్టేవాళ్లు. సినిమాల్లో హీరోహీరోయిన్లను, మంచివాళ్లను భయపెడుతుంటారు. కానీ కొన్ని సినిమాల్లో నటించిన విలన్లు మాత్రం ప్రేక్షకులను సైతం గజగజలాడించారు. వాటిలో 'స్పైడర్' మూవీ ఒకటి. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా ఇందులో విలన్ పాత్ర పోషించిన ఎస్జే సూర్య నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. సూర్య నటుడు మాత్రమే కాదు దర్శకుడు, రచియత, నిర్మాత కూడా! తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ నటుడికి ఇటీవలే టాలీవుడ్ నుంచి ఓ మంచి ఆఫర్ అతడి తలుపు తట్టిందట. కానీ సూర్య తనకు రూ.7 కోట్ల పారితోషికం ఇస్తేనే సినిమా చేస్తానని చెప్పడంతో నిర్మాతు ఖంగు తిన్నట్లు సమాచారం. ఇంతకీ సూర్యకు ఏ మూవీలో ఛాన్స్ వచ్చింది? అతడు ఆ ప్రాజెక్ట్‌కు ఓకే అయ్యాడా? లేదా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. -
మహేష్‌కు విలన్‌గా దర్శకుడు
టీనగర్: మహేష్‌బాబుకు విలన్‌గా నటించేందుకు దర్శకుడు ఎస్జే సూర్య అంగీకరించారు. కుషి, వాలి చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా అఆ, ఇసై, కళ్వనిన్ కాదలి, తిరుముగన్, వ్యాపారి తదితర చిత్రాలలో హీరోగాను నటించారు ఎస్జే సూర్య. విజయ్ నటనతో కొత్త చిత్రానికి దర్శకత్వం వహించేందుకు, పవన్ కల్యాణ్ నటనతో ఖుషి రెండో భాగాన్ని తెలుగులో దర్శకత్వం వహించేందుకు చర్చలు జరిగాయి. అయినప్పటికీ ఏదీ వర్కవుట్ కాలేదు. దీంతో మళ్లీ నటనపై దృష్టి సారించారు. హీరోగా నటించేందుకు చాన్స్ రాని పరిస్థితిలో నన్బన్, వైరాజావై, ఇరవి వంటి చిత్రాల్లో క్యారెక్టర్ పాత్రలలో నటించారు. ఆ తర్వాత దర్శకత్వమా? నటనా? అనే సందిగ్ధంలో ఉంటూ వచ్చారు. ఇలావుండగా ఆయన్ను విలన్‌గా నటించాలని కోరుతూ కొందరు దర్శకులు సంప్రదించారు. అందుకు మొదట్లో సంశయించినప్పటికీ ప్రస్తుతం సమ్మతం తెలిపారు. ఏఆర్ మురుగదాస్ తమిళ్, తెలుగులో దర్శకత్వం వహించే చిత్రంలో మహేష్‌బాబు హీరోగా నటిస్తున్నారు. ఇందులో విలన్‌గా నటించేందుకు మొదట్లో బాలీవుడ్ నటుడు ఒకరి వద్ద చర్చలు జరిగాయి. ప్రస్తుతం ఈ పాత్రలో ఎస్జే సూర్య నటించేందుకు ఒప్పుకున్నారు. అంతేకాకుండా ధనుష్ నటించే ‘ఎన్నై నోక్కి పా యుం తోటా’ చిత్రంలోను విలన్‌గా నటిస్తున్నారు.