మహేష్‌కు విలన్‌గా దర్శకుడు | SJ Suriya Villain For Mahesh Babu | Sakshi
Sakshi News home page

మహేష్‌కు విలన్‌గా దర్శకుడు

Apr 27 2016 2:21 AM | Updated on Sep 3 2017 10:49 PM

మహేష్‌కు విలన్‌గా దర్శకుడు

మహేష్‌కు విలన్‌గా దర్శకుడు

మహేష్‌బాబుకు విలన్‌గా నటించేందుకు దర్శకుడు ఎస్‌జే సూర్య అంగీకరించారు. కుషి, వాలి చిత్రాలకు దర్శకత్వం వహించడమే

 టీనగర్: మహేష్‌బాబుకు విలన్‌గా నటించేందుకు దర్శకుడు ఎస్‌జే సూర్య అంగీకరించారు. కుషి, వాలి చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా అఆ, ఇసై, కళ్వనిన్ కాదలి, తిరుముగన్, వ్యాపారి తదితర చిత్రాలలో హీరోగాను నటించారు ఎస్‌జే సూర్య. విజయ్ నటనతో కొత్త చిత్రానికి దర్శకత్వం వహించేందుకు, పవన్ కల్యాణ్ నటనతో ఖుషి రెండో భాగాన్ని తెలుగులో దర్శకత్వం వహించేందుకు చర్చలు జరిగాయి.
 
 అయినప్పటికీ ఏదీ వర్కవుట్ కాలేదు. దీంతో మళ్లీ నటనపై దృష్టి సారించారు. హీరోగా నటించేందుకు చాన్స్ రాని పరిస్థితిలో నన్బన్, వైరాజావై, ఇరవి వంటి చిత్రాల్లో క్యారెక్టర్ పాత్రలలో నటించారు. ఆ తర్వాత దర్శకత్వమా? నటనా? అనే సందిగ్ధంలో ఉంటూ వచ్చారు. ఇలావుండగా ఆయన్ను విలన్‌గా నటించాలని కోరుతూ కొందరు దర్శకులు సంప్రదించారు.
 
 అందుకు మొదట్లో సంశయించినప్పటికీ ప్రస్తుతం సమ్మతం తెలిపారు. ఏఆర్ మురుగదాస్ తమిళ్, తెలుగులో దర్శకత్వం వహించే చిత్రంలో మహేష్‌బాబు హీరోగా నటిస్తున్నారు. ఇందులో విలన్‌గా నటించేందుకు మొదట్లో బాలీవుడ్ నటుడు ఒకరి వద్ద చర్చలు జరిగాయి. ప్రస్తుతం ఈ పాత్రలో ఎస్‌జే సూర్య నటించేందుకు ఒప్పుకున్నారు. అంతేకాకుండా ధనుష్ నటించే ‘ఎన్నై నోక్కి పా యుం తోటా’ చిత్రంలోను విలన్‌గా నటిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement