శివకార్తికేయన్‌ కుమారుడి బారసాల.. ఎమోషనల్‌ పోస్ట్‌ వైరల్‌ | Sivakarthikeyan's Third Child Naming Ceremony | Sakshi
Sakshi News home page

శివకార్తికేన్‌ తనయుడి బారసాల.. ఏం పేరు పెట్టారంటే?

Jul 15 2024 10:17 AM | Updated on Jul 15 2024 11:16 AM

Sivakarthikeyan's Third Child Naming Ceremony

కోలీవుడ్‌ స్టార్‌ హీరో శివకార్తికేయన్‌ దంపతులకు ఇటీవలే మూడో బిడ్డ జన్మించాడు. ఇప్పటికే వీరికి కూతురు ఆరాధన, కుమారుడు గుగన్‌ పుట్టగా మూడోసారి మళ్లీ అబ్బాయే పుట్టాడు. తాజాగా అతడికి బారసాల చేశారు. ఈ మేరకు ఓ వీడియో షేర్‌ చేసిన హీరో.. పిల్లవాడికి పవన్‌ అని నామకరణం చేసినట్లు తెలిపాడు. అలాగే తన భార్య గురించి చెప్తూ ఎమోషనలయ్యాడు.

'ఆర్తి.. ఆపరేషన్‌ థియేటర్‌లో పిల్లల్ని కనేటప్పుడు నువ్వు ఎంత నరకం చూశావో నేను కళ్లారా చూశాను. ఆ బాధను భరిస్తూ నాకు అందమైన ప్రపంచాన్ని ఇచ్చినందుకు ఎప్పటికీ నీకు కృతజ్ఞుడినై ఉంటాను. లవ్యూ..' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. చివర్లో ఆరాధన- గుగన్‌ - పవన్‌ అంటూ తన ముగ్గురి పిల్లల పేర్లు ప్రస్తావించాడు. క్షణాల్లోనే ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

కాగా శివకార్తికేయన్‌ 2010లో బంధువులమ్మాయి ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2013లో ఆర్తి, 2021లో గుగన్‌ జన్మించారు. ఇకపోతే యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన శివకార్తికేయన్‌ తర్వాత హీరోగా మారాడు. మహావీరుడు, ప్రిన్స్‌, అయలాన్‌ చిత్రాలతో తెలుగువారికీ దగ్గరయ్యాడు.

 

 

చదవండి: 'కల్కి' ల్యాగ్ అనిపించింది.. ప్రభాస్‌ని అలా చూపించాల్సింది!

Advertisement
 
Advertisement
Advertisement