సంక్రాంతి బరిలో ఏలియన్ సినిమా.. ట్రైలర్ చూశారా? | Sivakarthikeyan Ayalaan Trailer Out; Here's Telugu Review | Sakshi
Sakshi News home page

Ayalaan Trailer: సామాన్యుడితో ఏలియన్ దోస్తీ.. ట్రైలర్ అదిరిపోయింది!

Jan 6 2024 7:09 AM | Updated on Jan 6 2024 7:37 AM

Sivakarthikeyan Ayalaan Trailer Telugu Review - Sakshi

ఈసారి సంక్రాంతికి తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. మహేశ్, నాగార్జున, వెంకటేశ్ లాంటి స్టార్ హీరోలతో పాటు తేజ సజ్జా కూడా సై అంటున్నారు. వీళ్లకే స్క్రీన్స్ సరిపోవట్లేదంటే ఏలియన్ స్టోరీతో తీసిన మూవీతో మరో హీరో పోటీకి రెడీ అంటున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. అది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది.

తెలుగులో సంక్రాంతికి నాలుగు స్ట్రెయిట్ మూవీస్ థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. వీటితో పలు డబ్బింగ్ చిత్రాలు కూడా డేట్స్ ప్రకటించాయి. అలా జనవరి 12న 'అయలాన్' అనే సినిమా తమిళంలో రిలీజ్ కానుంది. తెలుగులో వస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. కానీ తాజాగా ట్రైలర్ మాత్రం రిలీజ్ చేశారు. ఇందులో శివకార్తికేయన్ హీరో కావడంతో కామెడీకి కొదవ ఉండదు, అలానే ఏలియన్‪‌తోనూ కామెడీ చేయడం వెరైటీగా ఉంది.

(ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా)

ఇక కథ విషయానికొస్తే.. ఓ మారుమూల పల్లెటూరు. హ్యాపీగా ఉన్న యువకుడు (శివకార్తికేయన్) జీవితంలోకి ఓ ఏలియన్ అలియాస్ గ్రహాంతరవాసి అడుగుపెడుతుంది. అచ్చం మనిషిలా మాట్లాడుతూ ఉంటుంది. తొలుత భయపడినప్పటికీ.. ఆ తర్వాత సదరు యువకుడు, ఏలియన్‌తో స్నేహం చేస్తాడు. అయితే ఏలియన్ వచ్చింది.. ప్రపంచవినాశనానికి రెడీ అవుతున్న ఓ దుర్మార్గుడి అంతం కోసమని తెలిసి.. హీరో కూడా ఆ బాధ్యత తీసుకుంటాడు. ఆ తర్వాత ఏమైందనేదే 'అయలాన్' స్టోరీ.

అయితే ట్రైలర్ చూస్తుంటే.. అప్పుడెప్పుడో వచ్చిన హృతిక్ రోషన్ 'కోయి మిల్ గయా' ఛాయలు కనిపిస్తున్నాయి. అది పక్కనబెడితే కామెడీ, గ్రాఫిక్స్ బాగున్నాయి. మరి అనుకున్నట్లే జనవరి 12నే ఒకేసారి రెండు భాషల్లో రిలీజ్ చేస్తారా? లేదంటే తెలుగు రిలీజ్ ఓ వారం వాయిదా వేసుకుంటారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

(ఇదీ చదవండి: మరో వివాదంలో మహేశ్ 'గుంటూరు కారం' సినిమా?)

Advertisement
 
Advertisement
Advertisement