కోలీవుడ్‌ స్టార్‌ హీరోతో నేషనల్‌ క్రష్‌ రొమాన్స్‌! | Sivakarthikeyan And Rashmika Mandanna To Pair Up For The First Time | Sakshi
Sakshi News home page

రష్మిక చేతిలో మరో సినిమా.. కోలీవుడ్‌ స్టార్‌ హీరోతో నేషనల్‌ క్రష్‌ రొమాన్స్‌!

Jun 28 2024 11:39 AM | Updated on Jun 28 2024 11:59 AM

Sivakarthikeyan And Rashmika Mandanna To Pair Up For The First Time

తమిళ హీరో శివ కార్తికేయన్, హీరోయిన్‌ రష్మికా మందన్నా జంటగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. హీరో శివ కార్తికేయన్, దర్శకుడు సిబీ చక్రవర్తి కాంబినేషన్‌లో వచ్చిన కాలేజ్‌ క్యాంపస్‌ డ్రామా ‘డాన్‌’ (2022) హిట్‌ మూవీగా నిలిచింది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తాజాగా మరో సినిమా రానుందనే టాక్‌ తెరపైకి వచ్చింది. 

అంతేకాదు... ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికా మందన్నా నటించనున్నారనే ప్రచారం కూడా కోలీవుడ్‌లో జరుగుతోంది. ప్రస్తుతం ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో శివ కార్తికేయన్‌ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా తొలుత రష్మికా మందన్నా పేరు వినిపించింది. ఆ తర్వాత కియారా అద్వానీ పేరు కూడా తెరపైకి రాగా.. ఫైనల్‌గా కన్నడ బ్యూటీ రుక్ష్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా చాన్స్‌ దక్కించుకున్నారు. మరి... ప్రచారంలో ఉన్నట్లుగా ఈసారైనా శివ కార్తికేయన్, రష్మికల జోడీ సెట్‌ అవుతుందా? వేచి చూడాల్సిందే. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement