సిర్రాకైంది సింగిల్‌ బతుకు! | sirrakaindhi song release from single movie | Sakshi
Sakshi News home page

సిర్రాకైంది సింగిల్‌ బతుకు!

Apr 18 2025 12:09 AM | Updated on Apr 18 2025 12:09 AM

sirrakaindhi song release from single movie

శ్రీవిష్ణు హీరోగా, కేతికా శర్మ, ఇవాన హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సింగిల్‌’. ‘నిను వీడని నీడను నేనే’ మూవీ ఫేమ్‌ కార్తీక్‌ రాజు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్‌పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్‌ చౌదరి నిర్మించిన ఈ సినిమా మే 9న విడుదల కానుంది. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘సిర్రాకైంది సింగిల్‌ బతుకు...’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు. 

ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడారు. ‘‘సిర్రాకైంది సింగిల్‌ బతుకు...’ పాట ఫ్రస్ట్రేషన్‌ యాంథమ్‌గా సాగుతుంది. శ్రీవిష్ణు, ‘వెన్నెల’ కిశోర్‌ కలిసి ఒంటరితనానికి హ్యూమర్‌ని జోడించి పాడుకునే ఈ పాట వినోదాత్మకంగా ఉంటుంది. ఈ సాంగ్‌లోని సరదా సాహిత్యం, మాస్‌ అప్పీల్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి కెమేరా: ఆర్‌. వేల్‌రాజ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రోడ్యూసర్‌: అజయ్‌ గద్దె.

Advertisement
 
Advertisement
Advertisement