
కోలీవుడ్‌లో సుచీ లీక్స్ గొడవ మళ్లీ మొదలైంది. రోజుకొక సెలబ్రిటీ గురించి ఎదో వార్త వైరల్ అవుతూనే ఉంది. 2017లో కోలీవుడ్‌ను ఊపేసిన అత్యంత వివాదాస్పద అంశంగా సుచీ లీక్స్ వైరల్ అయింది. ప్రముఖ సింగర్ సుచిత్ర… సుచీ లీక్స్ పేరిట తన ఫేస్‌బుక్ ఖాతాలో చాలామంది ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసి తీవ్ర దుమారం సృష్టించింది. ఇందులో ధనుష్, ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి ఇలా ఎందరో హాట్ టాపిప్‌గా మారిన విషయం తెలిసిందే.
కొన్నేళ్ల తర్వాత సింగర్ సుచిత్ర మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ధనుష్, ఐశ్వర్య, త్రిష గురించి పలు విషయాలు తెలుపుతూ రచ్చ మొదలుపెట్టింది. తాజాగా కమల్ హాసన్‌పై సుచిత్ర సంచలన ఆరోపణ చేసింది. కమల్ హాసన్ ట్రాన్స్ జెండర్ అంటూ ఆమె ఒక ఇంటర్వ్యూలో బాంబ్ పేల్చింది. తమిళ్ బిగ్ బాస్‌కు హోస్ట్‌గా కమల్ కొనసాగిన విషయం తెలిసిందే.

గత సీజన్‌లో విక్రమ్ సినిమాతో పాపులర్ అయిన మాయ కంటెస్టెంట్‌గా పాల్గొంది. కమల్‌తో పాటు మాయ కూడా ట్రాన్స్‌జెండర్స్ అయి ఉంటారంటూ సుచిత్ర తెలిపింది. ఆయనకు చుడీదార్, కుర్తా అంటే ఎక్కువ ఇష్టమని ఆమె తెలిపింది. బిగ్ బాస్ సీజన్ 4లో సుచిత్ర కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. కమల్ విషయంలో రీసెర్చ్ చేసే ఈ విషయాలు చెబుతున్నానని సుచిత్ర పేర్కొంది. ఆ ఇంటర్వ్యూలో ఒక ట్రాన్స్ జెండర్‌తో కలిసి ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

కమల్ హాసన్ 'విశ్వరూపం' సినిమాలో క్లాసికల్ డాన్స్ చేస్తున్న సమయంలో ఆయన ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ ట్రాన్స్ జెండర్స్ మాదిరిగానే ఉంటాయని ఆమె గుర్తుచేసింది. అందులో కూడా కమల్ వైట్ డ్రెస్‌తో పాటు చుడీదార్ లాంటి దాన్ని ధరిస్తారని ఆమె తెలిపింది. కమల్ నిజజీవితంలో కూడా ఎక్కువగా అలాంటి దుస్తులే ధరిస్తారని ఆమె తెలిపింది.
సుచిత్ర చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కమల్ వ్యక్తిగతంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యల పట్లు ఆయన ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు వారు చెబుతున్నారు. మీడియా వారు కూడా ఆమెతో ఎలాంటి ఇంటర్వ్యూలు నిర్వహించకండి అంటూ వారు కోరుతున్నారు.
“Kamal Hassan is a transgender!” 🤯
Shocking revelation by singer #Suchitra
Arava nibba galla battalu oodadeestundi 😂😂😂#SuchiLeaks
pic.twitter.com/eWN4RzYiij— Aaku Bhai (@samuraigambhira) May 15, 2024