Bollywood Singer Sachet Tandon Buys New Expensive Benz Car, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Sachet Tandon New Car: లగ్జరీ కారు కొన్న బాలీవుడ్‌ సింగర్‌

Jun 3 2022 9:07 PM | Updated on Jun 4 2022 8:43 AM

Singer Sachet Tandon Buys New Mercedes Benz Car - Sakshi

బాలీవుడ్‌లో టాప్‌ సింగర్‌గా రాణిస్తున్న సాకెత్‌ తాజాగా కొత్త కారు కొన్నాడు. కుటుంబ సమేతంగా షోరూమ్‌కు వెళ్లి మెర్సిడిస్‌ బెంజ్‌ కారు కొనుగోలు చేశాడు.

బేకయాలి, మేరె సోనెయా, పల్‌ పల్‌ దిల్‌కే పాస్‌, మహియా మజ్ను, ఇష్క్‌ మేన్‌.. వంటి ఎన్నో హిట్‌ సాంగ్స్‌తో అలరించాడు సాకెత్‌ టండన్‌. సింగర్‌ పరంపరను పెళ్లాడిన ఆయన భార్యతో కలిసి కూడా పలు పాటలు ఆలపించాడు. బాలీవుడ్‌లో టాప్‌ సింగర్‌గా రాణిస్తున్న సాకెత్‌ తాజాగా కొత్త కారు కొన్నాడు. కుటుంబ సమేతంగా షోరూమ్‌కు వెళ్లి మెర్సిడిస్‌ బెంజ్‌ కారు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి కొత్త కారు ముందు ఫొటోలకు పోజులిచ్చారు.

దీనికి సంబంధించిన వీడియోను సాకెత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. కొత్త మెర్సిడిస్‌ కారును మా ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నాం. మాకు సపోర్ట్‌గా ఉంటూ మామీద ప్రేమ కనబరుస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీ ప్రేమానురాగాలు, ఆశీర్వాదాల వల్లే మేము ముందుకు సాగుతున్నాం అని రాసుకొచ్చాడు. దీనికి అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెప్తూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: టాలీవుడ్‌లో విషాదం, హీరో సత్య మృతి
లవ్‌ బ్రేకప్‌..తల్లయిన నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement