Tollywood Hero Sathya Passed Away Due To Heart Attack - Sakshi
Sakshi News home page

'Varam' Hero Sathya: టాలీవుడ్‌లో విషాదం, హీరో సత్య మృతి

Jun 3 2022 6:43 PM | Updated on Jun 3 2022 7:28 PM

Tollywood Hero Sathya Passed Away Due To Heart Attack - Sakshi

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సింగర్‌ కేకే మృతి నుంచి కోలుకోకముందే మరో హీరో మృతి చెందారు. వరం, బ్యాచిలర్స్‌ సినిమాల్లో కథానాయకుడిగా నటించిన సత్య గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గురువారం సాయంత్రం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

సత్య పూర్తి పేరు వి.రామసత్యనారాయణ. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో హీరో స్నేహితుడి పాత్రలు పోషించారు. తర్వాత వరం మూవీతో కథానాయకుడిగా మారారు. ఈ సినిమా పెద్దగా విజయవంతం ​కాలేదు. ఆ తర్వాత బ్యాచిలర్స్‌ సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోగా ఇది కూడా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో సినీ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పి బిజినెస్‌పై దృష్టి పెట్టారు.

ఇక కరోనా సమయంలో తల్లిని, భార్యను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు సత్య. అప్పటి నుంచి మానసిక క్షోభను అనుభవిస్తున్న ఆయన ఇప్పుడు గుండెపోటుతో మరణించారు. ఆయనకు ఎనిమిదేళ్ల కూతురు ఉంది. ఆయన మరణవార్త తెలిసిన బంధువులు, సెలబ్రిటీలు, శ్రేయోభిలాషులు సత్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సంతాపం తెలుపుతున్నారు.

చదవండి: డబ్బు అవసరమైంది, అందుకే వాటికి ఒప్పుకున్నాను: హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement