నటిని పెళ్లాడిన సింగర్‌, అందుకే ఎవరికీ చెప్పలేదట!

Singer Harshit Saxena Ties Knot with Samonica Shrivastava Last Month - Sakshi

సింగర్‌ హర్షిత్‌ సక్సేనా ఓ ఇంటివాడయ్యాడు. నటి సమోనికా శ్రీవాత్సవను పెళ్లి చేసుకున్నాడు. గత నెలలో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న వీరిద్దరూ తాజాగా ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడించారు. హర్షిత్‌ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సమోనికా, నేను ముంబైలో కలిశాం. మా మధ్య కేవలం పరిచయం మాత్రమే ఉంది. కానీ మా పేరెంట్స్‌ మమ్మల్ని ఒక జంటగా గుర్తించారు. సమోనికా తల్లి మా పేరెంట్స్‌తో మాట్లాడటంతో ఇదంతా మొదలైంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. మూడు రోజులపాటు ఎంతో ఘనంగా జరిగింది.

పెళ్లికి రెండు రోజుల ముందే నిశ్చితార్థం చేసుకున్నాం. కేవలం అతి దగ్గరి బంధుమిత్రుల మధ్యే వివాహం జరిగింది అని వెల్లడించారు. వీరి పెళ్లి ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌ఘర్‌లో ఫిబ్రవరి 9న ఫైవ్‌స్టార్‌ హెటల్‌లో జరిగింది. ఈ పెళ్లి విషయాన్ని గుట్టుగా ఉంచడానికి గల కారణాన్ని వెల్లడిస్తూ.. నాకు వరుస షెడ్యూల్స్‌ ఉన్నాయి. పెళ్లయిపోయిన వెంటనే వరుస పెట్టి లైవ్‌ షోలు ఉన్నాయి. అందుకే పెళ్లి గురించి ఎవరికీ చెప్పలేదు. కానీ నా ఫ్రెండ్స్‌ కోసం రిసెప్షన్‌ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాను' అని వెల్లడించాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top