బిగ్‌బాస్‌-13 విన్నర్‌, చిన్నారి పెళ్లి కూతురు ఫేం సిద్ధార్థ్‌ శుక్లా హఠాన్మరణం | Sidharth Shukla Dies of Heart Attack, Hospital Confirms | Sakshi
Sakshi News home page

Sidharth Shukla: బిగ్‌బాస్‌ విజేత సిద్ధార్థ్‌ శుక్లా హఠాన్మరణం

Sep 2 2021 11:51 AM | Updated on Sep 2 2021 12:55 PM

Sidharth Shukla Dies of Heart Attack, Hospital Confirms - Sakshi

ముంబై: బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 13 విజేత, బుల్లితెర నటుడు సిద్ధార్థ్‌ శుక్లా కన్నుమూశారు. ఆకస్మిక గుండెపోటుతో గురువారం ఉదయం 10.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. నిన్న రాత్రి నిద్రపోయే ముందు అతను కొన్ని మెడిసిన్స్‌​ తీసుకున్నట్లు, ఆ తరువాత మేల్కోలేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.  శుక్లా మరణాన్ని ముంబైలోని కూపర్‌ ఆసుపత్రి ధృవీకరించింది. నిద్రలోనే తీవ్రమైన గుండెపోటు రావడంతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. సిద్ధార్థ్‌కు తల్లి, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.

కాగా సిద్ధార్థ్‌ హఠాన్మరణం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. 40 ఏళ్ళకే నటుడు గుండెపోటుతో మృతి చెందడం షాక్‌కు గురిచేస్తోంది.  హిందీ హిట్‌ సీరియల్‌ బాలికా వధుతో సిద్ధార్థ్‌ శుక్లా టెలివిజన్‌ స్టార్‌గా ఎదిగాడు. ఈ సీరియల్‌ చిన్నారి పెళ్లికూతురుగా తెలుగులో డబ్‌ అయిన సంగతి తెలిసిందే. ఇక సీరియల్‌లో ఆనంది(కౌమార దశ) పాత్ర పోషించిన ప్రత్యూష బెనర్జీ బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. ఇలా బాలికా వధు హిట్‌ పెయిర్‌ అర్ధంతరంగా లోకాన్ని వీడటంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


చదవండి: డ్రగ్స్‌ కేసుతో నాకు సంబంధం లేదు : నటి సోనియా

ఇక శుక్లా 2014 లో కరణ్ జోహార్ నిర్మించిన “హంప్టీ శర్మకి దుల్హనియా” తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అందులో సిద్ధార్థ్ సహాయక పాత్రలో నటించాడు. అనంతరం “జలక్ దిఖ్లా జా 6”, “ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాది 7”, “బిగ్ బాస్ 13” వంటి రియాలిటీ షోలలో పాల్గొన్నాడు. అనేక వివాదాల నడుమ “బిగ్ బాస్ 13” విన్నర్ గా నిలిచాడు. ఆ తరువాత సిద్ధార్థ్‌ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడిప్పుడే కెరీర్‌లో ఎదుగుతున్న ఈ యంగ్‌ యాక్టర్‌ ఇలా అర్థాంతరంగా కన్నుమూయడం అందరిని షాక్‌కు గురిచేస్తోంది. ఆయన మృతికి పలువురు బాలీవుడ్ స్టార్స్‌ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


చదవండి: మాజీ ఎంపీ, సీనియర్‌ జర్నలిస్ట్‌ కన్నుమూత, ప్రధాని సంతాపం

Advertisement
 
Advertisement
Advertisement