ఆద్య ఆన్‌ సెట్‌ | Shruti Hassan in Salaar Movie Sets | Sakshi
Sakshi News home page

ఆద్య ఆన్‌ సెట్‌

Feb 11 2023 1:15 AM | Updated on Feb 11 2023 1:15 AM

Shruti Hassan in Salaar Movie Sets - Sakshi

‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ సినిమాల సక్సెస్‌ జోష్‌తో రెట్టింపు ఉత్సాహంతో వర్క్‌ చేస్తున్నారు హీరోయిన్‌ శ్రుతీహాసన్‌. ఇటీవలే ఇంగ్లిష్‌ ఫిల్మ్‌ ‘ది ఐ’ షూటింగ్‌ను దాదాపు పూర్తి చేసిన ఈ బ్యూటీ తాజాగా ‘సలార్‌’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ‘‘నాకు ఎంతో ఇష్టమైన ‘సలార్‌’ సెట్స్‌లో ఉన్నాను. మంచి యూనిట్‌తో, మంచి మనుషులతో వర్క్‌ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అని శ్రుతీహాసన్‌ పేర్కొన్నారు.

ప్రభాస్‌ హీరోగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్‌’ రూపొందుతోంది. ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆద్య పాత్రలో కనిపిస్తారు శ్రుతి. ప్రస్తుతం ప్రభాస్, శ్రుతీలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ  చిత్రం సెప్టెంబరు 28న విడుదల కానుంది. కాగా ‘సలార్‌’ రెండు భాగాలుగా రిలీజ్‌ కానుందనే టాక్‌ వినిపిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement