ఇద్దరితో బ్రేకప్.. పెళ్లికి స్టార్ హీరోయిన్ రెడీ..! | Shruti Haasan ready to going to arranged marriage talk goes viral | Sakshi
Sakshi News home page

Shruti Haasan: శృతి హాసన్ మెడలో మూడుముళ్లు.. అదంతా నిజమేనా?

Apr 19 2026 7:17 AM | Updated on Apr 19 2026 11:20 AM

Shruti Haasan ready to going to arranged marriage talk goes viral

కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తమిళంతో పాటు తెలుగులో సినిమాలు చేసింది. చివరిసారిగా రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ మూవీలో కనిపించింది. ఇప్పటికైతే ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. సినిమాలతో కాకపోయినా.. వ్యక్తిగత అంశాలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా శృతికి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అదేంటో మనం కూడా ఓ లుక్కేద్దాం.

అయితే గతంలో బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయిన ముద్దుగుమ్మ.. సింగిల్‌గానే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే శృతిహాసన్‌ గురించి కోలీవుడ్‌లో ఓ టాక్ వినిపిస్తోంది. శృతి పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పెద్దలు కుదిర్చిన వాడితోనే మూడుముళ్లకు రెడీ అయినట్లు లేటేస్ట్ టాక్. వరుడిని కోసం ఆమె తండ్రి కమల్ హాసన్ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని సంబంధాలను చూడగా.. అవీ వారికి నచ్చలేదని సమాచారం. వీలైనంత త్వరగా శృతి హాసన్‌కు మ్యారేజ్ చేయాలని కమల్‌ రెడీగా ఉన్నట్లు కోలీవుడ్ టాక్. అయితే ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

కాగా.. గతంలో లండన్‌కు చెందిన ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సలేతో శృతి డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజువల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతోనూ బ్రేకప్ అయింది. ఇప్పుడు అరేంజ్‌డ్‌ మ్యారేజ్‌కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement