జీవితమంతా వాళ్లకు సారీ చెబుతూనే ఉంటా: శ్రుతి హాసన్ | Shruti Haasan Reacts About Her Past Relationships In Latest Interview, More Details Inside | Sakshi
Sakshi News home page

Shruti Haasan: ప్రేమలో బ్రేకప్స్.. శ్రుతి హాసన్ రియాక్షన్ ఇదే

Apr 27 2025 3:42 PM | Updated on Apr 27 2025 5:43 PM

Shruti Haasan Reacts On Her Past Relationships

కమల్ హాసన్ కూతురిగా శ్రుతి హాసన్ అందరికీ తెలుసు. కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకున్న ఈమె.. క్రమంగా సినిమాలతో హిట్ కొడుతూ సక్సెస్ ఫుల్ అనిపించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన కెరీర్, లవ్ బ్రేకప్స్ గురించి మాట్లాడింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి

'నాకు ఎంతో ఇష్టమైన వాళ్లని కొన్నిసార్లు బాధపెట్టాను. అనుకోకుండా అది జరిగినప్పటికీ.. అలా చేసి ఉండకూడదని ఇప్పటికీ అనుకుంటూ ఉంటాను. జీవితమంతా వాళ్లకు సారీ చెబుతూనే ఉంటా. ప్రతి ఒక్కరి జీవితంలో బ్రేకప్ లవ్ స్టోరీ ఉంటుంది. మాజీ భాగస్వామి వల్ల ఎన్నో విషయాలు తెలుసుకుంటాం.నాకు అలాంటి బ్రేకప్ స్టోరీలు ఉన్నాయి'

'బ్రేకప్స్ గురించి నేను ఎక్కువ ఆలోచించను. నా లవ్ స్టోరీస్ గురించి చాలామంది ఏవేవో మాట్లాడుతుంటారు. ఇతడు ఎన్నో బాయ్ ఫ్రెండ్? అని అడుగుతూ ఉంటారు. వారి దృష్టిలో అది కేవలం నంబర్ మాత్రమే. నా వరకు వస్తే నేను అన్నిసార్లు ప్రేమలో విఫలమవుతున్నానని అర్థం. ఇప్పటికీ నాకు సరైన ప్రేమ దొరకలేదు' ‍అని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: వాళ్ల విడాకులు.. నేను చాలా బాధపడ్డాను: శ్రుతిహాసన్

'కెరీర్ ప్రారంభంలో తెలుగులో నా రెండు సినిమాలు ఫెయిలయ్యాయి. నన్ను చాలా మాటలు అన్నారు. కానీ హీరో సిద్ధార్థ్ ని మాత్రం ఏం అనలేదు. నాకు గబ్బర్ సింగ్ మూవీతో సక్సెస్ వచ్చింది. ఎక్కువ సినిమాలు చేయట్లేదని చాలామంది అంటుంటారు. కానీ నా మనసుకు నచ్చిన మూవీస్ చేస్తున్నానని వాళ్లకు తెలీదు' అని శ్రుతి తనపై వచ్చిన విమర్శలకు సమాధానమిచ్చింది.

మొన్నటివరకు శంతను హజరికా అనే ఆర్టిస్టుతో ప్రేమలో ఉన్న శ్రుతి హాసన్.. అంతకు ముందు ఓ విదేశీయుడితో చెట్టాపట్టాలేసుకుని కనిపించింది. కెరీర్ ప్రారంభంలో మాత్రం ఒకరిద్దరు హీరోలతో ఈమె రిలేషన్ షిప్ మెంటైన్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి. ప్రస్తుతానికైతే ఈమె ఎవరితోనూ ప్రేమలో లేదు!

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు

Advertisement
 
Advertisement
Advertisement