Shriya Saran: శ్రియాశరణ్‌పై దారుణంగా ట్రోల్స్.. స్పందించిన నటి..!

Shriya Saran trolled for kissing Andrei Koscheev at Drishyam 2 event - Sakshi

సీనియర్ నటి శ్రియాశరణ్ ఇటీవల నటించిన చిత్రం 'దృశ్యం-2'. మలయాళంలో సూపర్‌ హిట్‌ మూవీ దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా హిందీలో తెరకెక్కించారు. అయితే ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో శ్రియా శరణ్ తన భర్త టెన్నిస్ ప్లేయర్ ఆండ్రీ కోస్చివ్‌తో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా వేదికపై ఈ జంట చేసిన పనికి అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ‍శ్రియాపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దారుణంగా ట్రోల్స్‌ చేస్తూ శ్రియాశరణ్‌కు కౌంటరిచ్చారు.

అయితే నెటిజన్లు చేసిన ట్రోల్స్ పట్ల తాజాగా నటి శ్రియాశరణ్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ..' అందులో తప్పేముంది. కెమెరా ముందు నా భర్తను ముద్దు పెట్టుకున్నా. ఇది చాలా సాధారణమైన విషయమని ఆండ్రీ కూడా భావించారు. దీనిపై ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సందర్భం.' అంటూ చెప్పుకొచ్చింది శ్రియా. 
  
అయితే ఈ జంట కెమెరా ముందు ముద్దు పెట్టుకోవడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ జంట  కాస్త అతిగా స్పందించిందంటూ కామెంట్స్ చేశారు. మరో నెటిజన్ 'ప్రతిసారీ బహిరంగంగా ఎందుకు ముద్దు పెట్టుకోవాలి?' అని ప్రశ్నించారు. దృశ్యం 2 తర్వాత శ్రియా శరణ్ కన్నడలో ఉపేంద్ర, సుదీప్‌లతో కలిసి గ్యాంగ్‌స్టర్ డ్రామా కబ్జాలో కనిపించనుంది. ఈ చిత్రంలో కబీర్ దుహన్ సింగ్, కోట శ్రీనివాస్, కామరాజ్, జగపతి బాబు, డానిష్ అక్తర్ సైఫీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top