భారీ పారితోషికం: తగ్గేది లేదంటున్న పూజా హెగ్డే! | Shocking Remuneration Of Pooja Hegde For Vijay 65th Movie | Sakshi
Sakshi News home page

రెమ్యునరేషన్‌ పెంచిన బుట్టబొమ్మ!

Mar 9 2021 1:42 PM | Updated on Mar 9 2021 5:26 PM

Shocking Remuneration Of Pooja Hegde For Vijay 65th Movie - Sakshi

ఎప్పుడొచ్చామన్నది కాదు? ఎంత తీసుకున్నామనేది ముఖ్యం అంటూ కోట్లు డిమాండ్‌ చేస్తున్నారు..

అదిరేటి డ్రెస్సులతోనే కాదు, కళ్లు చెదిరేటి పారితోషికాన్ని తీసుకుంటూ దడ పుట్టిస్తున్నారు హీరోయిన్లు. ఎప్పుడొచ్చామన్నది కాదు? ఎంత తీసుకున్నామనేది ముఖ్యం అంటూ కోట్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణాదిన అగ్రతారగా వెలుగొందుతున్న పూజా హెగ్డే కూడా బాగానే వెనకేస్తోందట. అల వైకుంఠపురములో సినిమా బ్లాక్‌బస్టర్‌ కావడంతో ఆమెకు ఆఫర్లు వెల్లువలా వచ్చిపడ్డాయి. దీంతో తెలుగులో రాధేశ్యామ్‌, మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌, ఆచార్య, హిందీలో సర్కస్‌ సినిమాలు చేస్తోంది.

తాజాగా తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం ఆమెకు అక్షరాలా రెండున్నర కోట్ల పారితోషికం ముట్టినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇంత మొత్తంలో రెమ్యునరేషన్‌ అందుకోవడం తన కెరీర్‌లో ఇదే ప్రథమమని అంటున్నారు. ఆమెకున్న క్రేజ్‌ ప్రకారమైతే ఇంత మొత్తం తీసుకోవడంలో తప్పే లేదంటున్నారు ఆమె అభిమానులు. హీరోలు అర కోటి నుంచి మొదలు పెడితే వంద కోట్ల వరకు అందుకుంటున్నప్పుడు హీరోయిన్‌లకు ఆమాత్రం ఇవ్వడంలో పెద్ద వింతేమీ లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

కాగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో విజయ్‌ 65వ సినిమా చేస్తున్నాడు. ప్రధాన షెడ్యూల్‌ రష్యా, చెన్నైలో చిత్రీకరించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో శివకార్తికేయతోపాటు, బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

చదవండి: స్టార్‌ హీరోతో సినిమా.. రష్మిక అవుట్‌

ఓటీటీలో భారీ ధర పలికిన ‘నాంది’.. రిలీజ్‌ ఎప్పుడంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement