ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లే 'శివం భజే' ట్రైలర్ | Shivam Bhaje Telugu Trailer And Movie Details | Sakshi
Sakshi News home page

Shivam Bhaje Trailer: మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌కి డివోషనల్ టచ్ ఉంటే?

Jul 23 2024 1:09 PM | Updated on Jul 23 2024 5:51 PM

Shivam Bhaje Telugu Trailer And Movie Details

టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ వస్తుంటుంది. అలా ప్రస్తుతం డివోషనల్ తరహా స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. రెగ్యులర్ కాన‍్సెప్ట్‌కి చిన్న డివోషనల్ టచ్ ఇచ్చి సినిమాలు తీస్తున్నారు. రీసెంట్ బాక్సాఫీస్ సెన్సేషన్ 'కల్కి' కూడా ఇలాంటిదే. ఇప్పుడు డివోషనల్ ప్లస్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో తీసిన మూవీ 'శివం భజే'. తాజాగా దీని ట్రైలర్ రిలీజైంది.

(ఇదీ చదవండి: రోలెక్స్‌ని గుర్తుచేసిన సూర్య కొత్త సినిమా టీజర్)

ట్రైలర్ చూస్తే బాగానే ఉంది. ఎన్ఐఏ గూఢచారి సంస్థకి చెందిన ఏజెంట్ మన హీరో. ఓ మిషన్ కోసం పనిచేస్తుంటాడు. చివరకు ఏమైంది? అనుకున్న సాధించాడా లేదా అనేది పాయింట్. కాకపోతే ఈ స్టోరీకి శివుడు బ్యాక్ డ్రాప్‌ని జోడించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దగ్గర నుంచి రిఫరెన్స్‌ల వరకు చాలాచోట్ల శివుడు కనిపించాడు. ఆగస్టు 1న ఈ చిత్రం థియేటర్లలోకి వస్తోంది.

(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. నిజమేనా?)

Advertisement
 
Advertisement
Advertisement