అశ్విన్‌ బాబు ‘శివం భజే’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Shivam Bhaje Movie Release Date Out | Sakshi
Sakshi News home page

అశ్విన్‌ బాబు ‘శివం భజే’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Jul 13 2024 11:10 AM | Updated on Jul 13 2024 11:19 AM

Shivam Bhaje Movie Release Date Out

‘రాజుగారి గది’ ఫేమ్‌ అశ్విన్‌ బాబు, దిగంగనా సూర్యవన్షీ జోడీగా నటించిన ‘శివం భజే’ చిత్రం విడుదల తేదీ ఖరారు అయింది. ఆగస్టు 1న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అప్సర్‌ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్మెంట్స్‌పై మహేశ్వర్‌ రెడ్డి మూలి నిర్మించారు. మహేశ్వర్‌ రెడ్డి మూలి మాట్లాడుతూ– ‘‘న్యూ ఏజ్‌ డివైన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ‘శివం భజే’. వైవిధ్యమైన కథతో, ఉన్నత సాంకేతిక విలువలతో మా సంస్థలో నిర్మించిన తొలి చిత్రం ఇది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి’’ అన్నారు. 

‘‘టైటిల్, టీజర్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన మా ‘శివం భజే’ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి’’ అన్నారు అప్సర్‌. ‘‘ప్రతి ఒక్కరూ తమ బెస్ట్‌ ఇవ్వడంతో ఈ చిత్రం మేము ఊహించినదానికంటే అద్భుతంగా వచ్చింది. ఆ శివుని అనుగ్రహంతో ΄ాటు ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉంటాయని నమ్ముతున్నాం’’ అన్నారు అశ్విన్‌ బాబు. అర్బాజ్‌ ఖాన్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, తులసి ఇతర ΄ాత్రలు ΄ోషించిన ఈ చిత్రానికి మ్యూజిక్‌: వికాస్‌ బడిస, కెమెరా: దాశరథి శివేంద్ర. 

Advertisement
 
Advertisement
Advertisement