నా కళ్లతో భయపెట్టాను! | Shiva Rajkumar Starrer Ghost Teaser Released | Sakshi
Sakshi News home page

నా కళ్లతో భయపెట్టాను.. దే కాల్‌ మీ ఓజీ... ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌

Jul 13 2023 4:27 AM | Updated on Jul 13 2023 10:32 AM

Shiva Rajkumar Starrer Ghost Teaser Released - Sakshi

‘‘మీరు గన్నుతో ఎంత మందిని భయపెట్టారో అంతకంటే ఎక్కువ మందిని నేను నా కళ్లతో  భయపెట్టాను. దే కాల్‌ మీ ఓజీ... ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌’ అనే డైలాగ్‌తో  ‘ఘోస్ట్‌’ సినిమా టీజర్‌ విడుదలైంది. కన్నడ హీరో శివ రాజ్‌కుమార్‌ నటించిన చిత్రం ‘ఘోస్ట్‌’. శ్రీని (బీర్బల్‌) దర్శకత్వంలో సందేశ్‌ నాగరాజ్‌ పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మించారు. బుధవారం శివ రాజ్‌ కుమార్‌ పుట్టినరోజుని (జూలై 12) పురస్కరించుకుని ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో దసరాకి ‘ఘోస్ట్‌’ ప్రేక్షకుల ముందుకి రానుంది.  

తెలుగు నిర్మాతతో...  
శివ రాజ్‌కుమార్‌ హీరోగా తెలుగు నిర్మాత సుధీర్‌ చంద్ర పదిరి కన్నడంలో ఓ సినిమా నిర్మించనున్నారు. శివ రాజ్‌కుమార్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు. ఈ చిత్రానికి కార్తీక్‌ అద్వైత్‌ దర్శకత్వం వహించనున్నారు. ఎస్‌సీఎఫ్‌సీపై (సుధీర్‌ చంద్ర ఫిల్మ్‌ కంపెనీ) సుధీర్‌ చంద్ర పదిరి నిర్మించనున్న ఈ మూవీ క్యారెక్టర్‌ కాన్సెప్ట్‌ ΄ోస్టర్‌ని బుధవారం రిలీజ్‌ చేశారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ సీఎస్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement