Shilpa Shirodkar, First Bollywood Actress To Get Corona Vaccine | బాలీవుడ్‌ సెలబ్రిటీ శిల్పా శిరోద్కర్ - Sakshi
Sakshi News home page

కరోనా టీకా తీసుకున్న మొట్టమొదటి బాలీవుడ్‌ నటి

Jan 8 2021 12:03 PM | Updated on Jan 8 2021 4:14 PM

Shilpa Shirodkar Becomes First Bollywood Actress to get COVID-19 vaccine - Sakshi

దుబాయ్‌ : కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న మొట్టమొదటి నటిగా బాలీవుడ్‌ సెలబ్రిటీ శిల్పా శిరోద్కర్ నిలిచారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న 51 ఏళ్ల శిల్పా యూఏఈలోనే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయం‍గా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా యూఏఈ ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు. గోపి కిషన్’, ‘బేవాఫా సనమ్’, ‘కిషన్ కన్హయ్య’, ‘హమ్’ చిత్రాలతో బాలీవుడ్‌లో పాపులర్‌ అయినఆమె  2000వ సంవత్సరంలో బ్రిటన్‌కు చెందిన అపెరేష్ రంజిత్ అనే వ్యక్తిని పెళ్లాడింది. వివాహం అనంతరం కొంత గ్యాప్‌ తీసుకున్న శిల్పా 2013లో పాపులర్‌ సీరియల్‌ ‘ఏక్ ముత్తి ఆస్మాన్’ లో నటించింది. శిల్పా శిరోద్కర్‌ ప్రముఖ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు భార్య నమ్రతకు సోదరి అన్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement