హార్ట్‌ సర్జరీ! బిగ్‌బాస్‌ విన్నర్‌ అభ్యర్థన | Shilpa Shinde Sister In Law Undergoes Open Heart Surgery | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ విన్నర్ బంధువుకు‌ గుండె శస్త్ర చికిత్స

Jan 29 2021 8:30 PM | Updated on Jan 29 2021 8:56 PM

Shilpa Shinde Sister In Law Undergoes Open Heart Surgery - Sakshi

ముంబై: హిందీ బిగ్‌బాస్‌ 11వ సీజన్‌ విన్నర్‌ శిల్పా షిండే బంధువు తృప్తి పటేల్‌ షిండే గుండెకు శస్త్ర చికిత్స చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె క్షేమంగా ఉండాలని ప్రార్థించమని శిల్పా అభిమానులను కోరింది. ఈ మేరకు తృప్తితో కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేసింది. "అభిమానులే నా దేవుళ్లు. కష్టసుఖాల్లో నా వెంట నిలబడుతున్న అభిమానులకు కృతజ్ఞతలు. నా దగ్గరి బంధువు తృప్తికి నానావతి ఆస్పత్రిలో హార్జ్‌ సర్జరీ జరగబోతుంది. ఆమెకు అంతా మంచి జరగాలని కోరుకోండి" అంటూ ఫ్యాన్స్‌ను అభ్యర్థించింది. (చదవండి: టీవీ నటుడి రెండో పెళ్లి)

ఇదిలా వుంటే శిల్పా.. "బాబీ జీ ఘర్‌ పర్‌ హై"లో అనిత బాబీ పాత్రలో ఉత్తమ నటన కనబర్చావంటూ నేహా పెండ్సేను మెచ్చుకుంది. నిజానికి ఆ పాత్రను నటి సౌమ్య టండన్‌ కొన్నేళ్లుగా చేస్తోంది. అయితే ఈ మధ్యే ఆమె సీరియల్‌ నుంచి తప్పుకోవడంతో నేహా కొత్తగా ఆ స్థానంలో అడుగుపెట్టింది.. ఇక అదే సీరియల్‌లో అంగూరి బాబీగా మెప్పించిన శిల్పా సైతం తప్పుకోవడంతో ఆమె స్థానంలో శుభంగి ఆత్రే నటిస్తోంది. శిల్పా లాక్‌డౌన్‌లో "గ్యాంగ్స్‌ ఆఫ్‌ ఫిల్మిస్తాన్‌" అనే కామెడీ షోలోనూ పాల్గొంది. కానీ అది టీవీలో టెలికాస్ట్‌ కాకముందే షో నుంచి తప్పుకోవడం గమనార్హం. (చదవండి: స్నేహితుడిని పెళ్లాడిన బాలీవుడ్‌ సింగర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement