నాకు చాలా బాధను కలిగించింది.. చీటింగ్‌ కేసుపై నోరు విప్పిన శిల్పా శెట్టి

Shilpa Shetty Reaction On FIR Registration Against Raj Kundra Couple - Sakshi

రాజ్‌ కుంద్రా దంపతులపై ఒక వ్యాపారవేత్త చేసిన చీటింగ్, ఫోర్జరీ ఆరోపణలపై నటి శిల్పా శెట్టి నోరు విప్పారు. ఆ ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. 'రాజ్‌, నా పేరు మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదైందన్న వార్త నుంచి ఇప్పుడే తేరుకున్నాను. షాకింగ్‌గా ఉంది. ఎస్‌ఎఫ్‌ఎల్‌ ఫిట్‌నెస్‌ వెంచర్‌ నిర్వహిస్తుంది కాషిఫ్‌ ఖాన్‌. అతను దేశవ్యాప్తంగా ఎఎస్‌ఎఫ్ఎల్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌లను తెరవడానికి బ్రాండ్‌ ఎస్‌ఎఫ్‌ఎల్‌ పేరుతో హక‍్కులు తీసుకున్నాడు. అతను అన్ని ఒప్పందాలు కుదుర్చుకుని, బ్యాంకింగ్‌, రోజువారీ వ్యవహారాలలో సంతకం చేశాడు. అతని లావాదేవీల గురించి మాకు తెలియదు. అతని నుంచి మేము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అన్ని ఫ్రాంఛైజీలన్నీ నేరుగా కాషిఫ్‌తోనే నిర్వహిస్తారు. పూర్తిగా కాషిఫ్‌ ఖాన్‌ ద్వారా నిర్వహించబడే కంపెనీని 2014లో మూసివేశారు.' అని శిల్పా శెట్టి ట్వీట్‌ చేశారు.

'గత 28 ఏళ్లుగా నేను చాలా కష్టపడ్డాను. నా పేరు, ప్రతిష్ట దెబ్బతినడం, నన్ను ఇబ్బందుల్లోకి లాగడం చూసి నాకు చాల బాధ పడ్డాను. భారతదేశ చట్టాలను గౌరవించే పౌరురాలిగా నా హక్కులు రక్షించబడాలి. కృతజ్ఞతలతో శిల్పా శెట్టి కుంద్రా.' అని కూడా ట్విటర్‌లో రాసుకొచ్చారు శిల్పా శెట్టి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top