Farhan Akhtar Girlfriend: బాయ్‌ఫ్రెండ్‌ పేరును మెడపై టాటూ వేసుకున్న నటి

Shibani Dandekar Tattoos Boyfriend Farhan Akhtar Name On Her Neck - Sakshi

నటి, గాయని శిబానీ దండేకర్‌ కొత్త టాటూ వేయించుకున్నారు. బాయ్‌ఫ్రెండ్‌ ఫర్హాన్‌ అక్తర్‌ పేరును ఆమె మెడమీద పచ్చబొట్టు వేసుకున్నారు. ఈ విషయాన్ని శిబానీనే స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో మెడపైన ఉన్న  ఫర్హాన్‌ అక్తర్‌ అని ఉన్న టాటూ చిత్రాన్ని పంచుకున్నారు. ముందుగా దీనిని టూటూ ఆర్టిస్ట్‌ కే షేర్‌ చేయగా అనంతరం శిబానీ రీపోస్టు చేశారు. ఈ ఫోటోలో ఆమె ముఖం పూర్తిగా కనిపించపోయిన మెడపై పచ్చబొట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. కాగా శిబానీ, పర్హాన్‌ గత మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న​ విషయం తెలిసిందే. 
చదవండి: షూటింగ్‌లో గాయపడ్డ ప్రియాంక! ఆందోళనలో ఫ్యాన్స్‌..

అయితే తమ ప్రేమ విషయాన్ని ఎప్పుడూ దాచేందుకు ప్రయత్నించలేదు ఈ జంట. కొన్నేళ్ల క్రితమే తామ బంధాన్ని సోషల్‌ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి శిబానీ దండేకర్‌, ఫర్హాన్ అక్తర్ తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో తమకు చెందిన విషయాలను షేర్‌ చేస్తూ ఉంటారు. కాగా గత ఫిబ్రవరిలో షీబానీ, ఫర్హాన్‌ ప్రేమ ప్రయాణానికి మూడేళ్లు  పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఫర్హాన్.. శిబానీని ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను షేర్ చేశాడు. ఇక ఇటీవల వీరి పెళ్లి ప్రస్తావన రాగా.. వివాహం గురించి ఇంకా ప్లాన్‌ చేసుకోలేదని, ఎప్పుడూ ఈ టాపిక్‌ మాట్లాడుకోలేదని నటి పేర్కొన్నారు. ఒకవేళ ప్లాన్‌ చేసుకుంటే తప్పకుండా చెబుతామని వెల్లడించారు.

ఇదిలా ఉండగా ఫర్హాన్ అక్తర్‌ ఇంతకముందే హెయిర్‌స్టైలిస్ట్ అధునా భబానీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక సినిమా విషయానికొస్తే రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో ఫర్హాన్‌ నటించిన తుఫాన్‌ చిత్రం జూలై 16న ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైంలో విడుదల అయింది.
చదవండి: టాలీవుడ్‌లోకి మరో వారసురాలు.. హీరోయిన్‌గా మేధ శ్రీకాంత్‌!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top