Shekhar Suman Big Revelation That I Was Not Against Adhyayan Relationship With Kangana Ranaut - Sakshi
Sakshi News home page

కంగనా- అధ్యాయన్‌ల ప్రేమకు నేను అడ్డు రాలేదు.. నటుడి తండ్రి

May 17 2023 3:32 PM | Updated on May 17 2023 4:05 PM

Shekhar Suman: I was Not Against Adhyayan Relationship with Kangana Ranaut - Sakshi

హృతిక్‌ రోషన్‌తో రిలేషన్‌లో.. అర్ధరాత్రి ఇంటికి రప్పించి చేతబడి చేసిందని కూడా ఆరోపించాడు.

సెలబ్రిటీలకు ప్రేమకహానీలుండటం మామూలే, అందుకు కంగనా రనౌత్‌ కూడా అతీతురాలు కాదు. 'రాజ్‌: ద మిస్టరీ కంటిన్యూస్‌' సినిమా షూటింగ్‌ సమయంలో కంగనా రనౌత్‌, అధ్యాయన్‌ సుమన్‌ ప్రేమలో పడ్డారు. కానీ ఈ ప్రేమకథ సజావుగా సాగలేదు. ఎన్నో ట్విస్టుల మధ్య అర్ధాంతరంగా ముగిసింది. ఆ తర్వాత దీని గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అధ్యాయన్‌, అతడి తండ్రి శేఖర్‌ సుమన్‌ కంగనాను విమర్శిస్తూ ఆమె మీద నోరు పారేసుకునేవాళ్లు!

కానీ చాలాకాలం తర్వాత కంగనా- అధ్యాయన్‌ల ప్రేమ, పోట్లాటల గురించి పాజిటివ్‌గా స్పందించాడు శేఖర్‌ సుమన్‌. 'ఏం జరుగుతుందో అంతా చూస్తూనే ఉన్నాను. కానీ ఎప్పుడూ కంగనాతో మాట్లాడలేదు. ఎందుకంటే అది నా కొడుకు చేస్తున్న పోరాటం. నా కొడుకు తప్పు చేశాడని అనుమానించను, అతడు చేస్తున్న పోరాటంలో అండగా నిలబడ్డాను. నిజానికి ఎవరి ప్రేమకీ నేను అడ్డు రాను. కంగనా, అధ్యాయన్‌ల ప్రేమను నేనేమీ వ్యతిరేకించలేదు. కాకపోతే జీవితంలో ఒక దశ ఉంటుంది. తొలిచూపులోనే ప్రేమలో పడ్డవారితో జీవితం ముందుకు సాగచ్చు, లేదంటే ఆ ప్రేమ అర్ధాంతరంగానే ఆగిపోవచ్చు. నా కొడుకు జీవితంలో రెండవది జరిగింది.

ఎవరూ ఫస్ట్‌ రిలేషన్‌షిప్‌ను తెంచేయాలనుకోరు. కానీ అది మన చేతుల్లో ఉండదు కదా! ఈ సొసైటీ డ్రామానే ఎక్కువ ఇష్టపడుతుంది. పక్కన ఉండే స్నేహితులు కూడా మన సంతోషాన్ని చూడాలనుకోరు. చాలామంది కంగనా- అధ్యాయన్‌ల బంధం ముగిసిపోవాలని కోరుకున్నారేమో! వారి బ్రేకప్‌కు కారణం అధ్యాయనో, కంగనానో కాదు. ఇందులో ఎవరి తప్పూ లేదు. పరిస్థితులు వారితో ఆ నిర్ణయం తీసుకునేలా చేశాయి. ఆ తర్వాత ఏదో ఆవేశంలో నా కొడుకు పొరపాటున ఏదేదో వాగినా తర్వాత దాని గురించి క్షమాపణలు చెప్పాడు. అతడికి ఎవరిపైనా కోపం లేదు' అని చెప్పుకొచ్చాడు శేఖర్‌ సుమన్‌.

కాగా మహేశ్‌ భట్‌ డైరెక్ట్‌ చేసిన రాజ్‌ సినిమాలో కంగనా, అధ్యాన్‌ కలిసి నటించారు. కొంతకాలంపాటు డేటింగ్‌ చేసిన వీరిద్దరూ తర్వాత సడన్‌గా బ్రేకప్‌ చెప్పుకున్నారు. కంగనా.. హృతిక్‌ రోషన్‌తో రిలేషన్‌లో ఉండటం వల్లే తనతో విడిపోయానని గతంలో వెల్లడించాడు అధ్యాయన్‌. అటు శేఖర్‌ సుమన్‌ కూడా తన కొడుకును కంగనా అర్ధరాత్రి ఇంటికి పిలిపించుకుని చేతబడి చేసిందని ఆరోపించాడు.

చదవండి: శర్వానంద్‌ పెళ్లి ముహూర్తం ఫిక్స్‌, వేదిక ఎక్కడంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement