రీసెంట్ టైంలో హీరోలందరూ ఊరమాస్, యాక్షన్ బాట పడుతున్నారు. 'పెద్ది'తో రామ్ చరణ్, 'ప్యారడైజ్'తో నాని ఈ తరహా మూవీస్ చేయగా.. ఇప్పుడు శర్వానంద్ 'భోగి' అనే మాస్ యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. ఈ చిత్ర టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. అలానే థియేట్రికల్ విడుదల తేదీని వెల్లడించారు.
సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసిన సినిమా 'భోగి'. డింపుల్ హయాతి కీలక పాత్రధారి. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ బట్టి చూస్తే తెలంగాణ నేపథ్యంలోని పీరియడ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ అని అర్థమైంది.
దొరల దురాగతాలు, అణచివేతకు ఎదురుతిరిగే ఓ నాయకుడి కథని పవర్‌ఫుల్‌గా చూపించినట్లు తెలుస్తోంది. టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాపై అంచనాలను పెంచేలా ఉన్నాయి. శర్వానంద్ సరికొత్త అవతారంలో మాసీగా కనిపించాడు. వచ్చే నెల 12న థియేటర్లలో మూవీ రిలీజ్ కానుంది. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతమందించాడు.


