బాలీవుడ్ ప్రముఖ నటుడు శక్తి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 80, 90లలో ఆయన హింది చిత్రాల్లో విలన్‌గా, కమెడియన్‌గా నటించి స్టార్ నటుడిగా గుర్తింపు పొందారు. ఇక వారసురాలిగా శ్రద్ధా కపూర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా బి-టౌన్‌లో గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే తనదైన నటన, కామెడీతో విలక్షణ నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన శక్తి కపూర్ ఒకానోక సమయంలో పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు.
కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేస్తున్న లెజెండరి కమెడియన్స్ ఆఫ్ ఇండియన్ సినిమా షోకు శక్తి కపూర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయనతో పాటు మరో హాస్యనటులు అస్రానీ, పెంటల్, టీకు తల్సానియా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శక్తి కపూర్ మాట్లాడుతూ.. ఓ సినిమా షూటింగ్ సమయంలో తాను మూడు చెంప దెబ్బలు తిన్నానని, దానివల్ల తాను పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘నా మొదటి కామెడీ చిత్రం సత్తె పే సత్తా. ఇందులో పెంటల్‌తో కలిసి పని చేశాను. అది చాలా మంచి చిత్రం.
అందులో నటించాలని ఓ కామెడీ పాత్ర కోసం రాజ్ సిప్పీ నన్ను సంప్రదించినప్పుడు నా విలన్ పాత్రలకు ప్రశంసలు లభిస్తున్నట్లు అనిపించింది. అందుకు తగ్గట్లే ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత మావాలి అనే సినిమా చేశాను. సినిమాలో మొదటి షాట్ తీస్తున్నప్పుడు ఖాదర్‌ఖాన్ నా చెంప మీద కొట్టాడు. దాంతో నేను నేలపై పడ్డాను. రెండో షాట్‌లో అరుణా ఇరానీ చెంప మీద కొట్టింది. మళ్లీ నేలపై పడ్డాను. మూడోసారి కూడా అదే జరిగింది. దాంతో నా కెరీర్ ముగిసింది అనుకున్నా’ అంటూ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘మూడుసార్లు చెంప దెబ్బలకు నెలపై పడ్డ నేను.. నా కెరీర్ ముగిసిపోయిందని ఆందోళన పడ్డాను.
ఈ సినిమాకు కె.బాపయ్య దర్శకత్వం వహించారు. అందులో ఖాదర్ ఖాన్ కూడా నటించారు. ఇక షూటింగ్ గ్యాప్‌లో ఖాదర్ ఖాన్ వద్దకు వెళ్లి.. మీకు దండం పెడతా(కాళ్లు మొక్కుతా అని బతిమాలను). నాకు సాయంత్రం టిక్కెట్ బుక్ చేయండి. నేను వెళ్లిపోతా. ఈ సినిమా నేను చేయలేను. నా కెరీర్ కూడా ముగిసిపోయింది. నాకు ఇంకా పెళ్లి కూడా కాదు’ అని అన్నాను. అయితే అదంతా గమనించిన యాక్షన్ డైరెక్టర్ వీరు దేవగన్ నా దగ్గరకి వచ్చి.. ‘ఈ చెంప దెబ్బ మీకు మరింత పాపులారిటిని తెచ్చి పెడుతుంది. మీరు ఏమాత్రం ఆలోచించకుండ ఈ సినిమా చేయండి’ అని సలహా ఇచ్చారు. ఆయన అడ్వైస్‌తో నేను ఇండస్ట్రీలో కొనసాగను’’ అంటూ శక్తి కపూర్ చెప్పుకొచ్చారు.
చదవండి:
ఆసక్తిగా సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష టైటిల్ గ్లింప్స్, ఎన్టీఆర్ వాయిస్ అదుర్స్
అభిమానిగానే చిరంజీవికి ఆనాడు విజ్ఞప్తి చేశా: వర్మ క్లారిటీ
Comments
Please login to add a commentAdd a comment