Shahrukh Khan turns Producer For Couple Of OTT Releases - Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: ఓటీటీలోకి బాలీవుడ్‌ బాద్‌షా!

May 21 2021 11:26 AM | Updated on May 21 2021 11:37 AM

Shahrukh Khan turns Producer For Couple Of OTT Releases - Sakshi

ఇప్పటికే బాలీవుడ్‌కు చెందిన పలువురు హీరో, హీరోయిన్లు ఓటీటీ బిజినెస్‌లో రాణిస్తున్నారు.

Shah Rukh Khan: కరోనా కారణంగా సినిమా థీయేటర్లకు తాళం పడింది. దీంతో ఓటీటీల డిమాండ్‌ అమాంతం పెరిగిపోయింది. చిన్న, పెద్ద తేడా లేకుండా సినిమాలన్నీ ఓటీటీ బాట పడుతున్నాయి. కొన్ని సినిమాలు అయితే కేవలం ఓటీటీల కోసమే నిర్మిస్తున్నారు. మరో పక్క స్థానిక భాషల్లో కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. బడా హీరో, హీరోయిన్లు సైతం ఓటీటీ బిజినెస్‌ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌కు చెందిన పలువురు హీరో, హీరోయిన్లు ఓటీటీ బిజినెస్‌లో రాణిస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సైతం ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే ఆయన హీరోగా కాకుండా, నిర్మాతగా ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నాడట. షారుఖ్ త్వరలో నిర్మాతగా ఓటీటీ ప్లాట్‌ఫాంలో సినిమాలు రూపొందించబోతున్నట్లు బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఆయన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్‌లో నిర్మించబోయే ఓటీటీ చిత్రాల కోసం ఇప్పటికే కొన్ని స్క్రిప్ట్స్ ఓకే చేసి పెట్టినట్లు తెలుస్తుంది. ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైనట్టు సమాచారం.  ఈ ఏడాది చివర్లో  రెండు ఓటీటీ ప్రాజెక్ట్స్ తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం షారుఖ్‌ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'పఠాన్' అనే యాక్షన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా తాత్కాలికంగా షూటింగ్‌కి బ్రేక్ పడింది.  
చదవండి:
ఓటీటీలో ఏక్‌ మినీ కథ, అప్పుడే రిలీజ్‌

Advertisement
 
Advertisement
Advertisement