వచ్చి పలకరించాడు, అప్పుడు పిచ్చోడిలా ప్రవర్తించాననుకో!

Shaan Remembers Not Recognising Honey Singh At Party - Sakshi

సెలబ్రిటీలు అన్నాక గుర్తింపు కోరుకుంటారు. ఏ పార్టీలోనైనా స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలవాలనుకుంటారు. కానీ వాళ్లను ఎవరూ గుర్తించకపోతేనే ఎంతో ఫీలవుతారు. ప్రముఖ ర్యాపర్‌  యోయో హనీసింగ్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అందుకు తానే కారణమంటున్నాడు బాలీవుడ్‌ సింగర్‌ షాన్‌.

తాజాగా షాన్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "యోయో హనీసింగ్‌ను అంతకు ముందెప్పుడూ నేరుగా చూడలేదు. కేవలం టీవీలోనే చూసేవాడిని. ఓ పార్టీలో అతడిని ప్రత్యక్షంగా చూశాను, కలిశాను. కానీ అతడే హనీసింగ్‌ అని గుర్తుపట్టలేదు. స్క్రీన్‌ మీద బక్కపలుచగా ఉండే అతడు రియాలిటీలో మాత్రం లావుగా ఉన్నాడు. ఆయన నా దగ్గరకొచ్చి షాన్‌ సర్‌, నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను అంటూ నవ్వుతూ మాట కలిపాడు. అయినప్పటికీ అతడెవరో పోల్చుకోలేకపోయాను.

ఆ తర్వాత నాతో మాట్లాడింది హనీసింగ్‌ అని అర్థమైంది. వెంటనే అతడి దగ్గరకు వెళ్లి ఇప్పటిదాకా మిమ్మల్ని గుర్తు పట్టలేకపోయాను, సారీ అని చెప్పాను. దానికతడు కొంచెం బాధపడ్డాడు. నిజంగానే అప్పుడు నేను పిచ్చోడిలా ప్రవర్తించాను. అతడిని గుర్తుపట్టలేదు అని చెప్పకుండా ఉంటే సరిపోయేది కదా!" అని పేర్కొన్నాడు. కాగా షాన్‌ ఆ మధ్య ర్యాప్‌ సాంగ్స్‌ మీద చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. జనాలకు సంగీతాన్ని అర్థం చేసుకునే కళ లేనందునే ర్యాప్‌ సాంగ్స్‌కు ఆదరణ పెరుగుతుందని షాన్‌ విమర్శించాడు. హనీసింగ్‌ ఆలపించిన లుంగి గ్యాన్స్‌, సన్నీ సన్నీ వంటి పాటలను ఎవరైనా పాడగలరని పెదవి విరిచాడు.

చదవండి: ఆరోజే 'ఐ లవ్‌యూ' చెప్పుకున్నాం.. బుక్స్‌ ఇచ్చి అందులో ఏం రాసేవాడంటే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top