అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, ఒకరికి ఒకరు, దటీజ్ మహాలక్ష్మి, రాధకు నీవేరా ప్రాణం తదితర సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన చైత్ర రాయ్.. ఈ ఏడాది జూలైలో రెండోసారి ప్రెగ్నెన్సీ ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు వేడుకగా సీమంతం చేసుకుంది. ఈసారి చాలా స్పెషల్ అని చెబుతూ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకుంది.
(ఇదీ చదవండి: నా కొడుకు ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా?: గిరిజా ఓక్)
'చాలా ఆనందంగా రెండో సీమంతాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం. చాలామంది మళ్లీ ఎందుకు అని అడిగారు. కానీ ప్రతి బిడ్డ కూడా వరమే కదా. ప్రతిక్షణం ప్రేమ కావాలి కదా. నా మొదటి సీమంతం కొవిడ్ టైంలో చేసుకున్నాను. అప్పుడు చాలా పరిమితంగానే జరుపుకొన్నాం. ఈసారి మాత్రం భర్త నాతో పాటు ఉన్నాడు. అప్పుడు ఆయన రావడం కుదరలేదు' అని చైత్ర రాయ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ప్రెగ్నెన్సీ విషయాన్ని కొంతకాలంగా మేము రహస్యంగానే ఉంచాం. ఇప్పుడు ఆ సీక్రెట్‌ని మీ అందరితో పంచుకోవాలనిపించింది. నాకు మరో బేబీ రాబోతోంది. నిశ్క శెట్టి అక్కగా ప్రమోషన్ పొందనుంది. రెండోసారి గర్భం దాల్చినప్పటి నుంచి మా మనసులు సంతోషంతో నిండిపోయాయి అని జూలైలో పోస్ట్ పెట్టి చైత్ర.. ఇప్పుడు సీమంతం చేసుకుంది. కొత్త ఏడాదిలో బిడ్డకు జన్మనివ్వబోతుందని తెలుస్తోంది. స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన చైత్ర.. సొంత భాషతో పాటు తెలుగులోనూ సీరియల్స్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమాలోనూ యాక్ట్ చేసింది.
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన స్టార్ డైరెక్టర్ సినిమా)




