సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన స్టార్ డైరెక్టర్ సినిమా | Anurag Kashyap’s ‘Nisanchi Part 2’ Drops on OTT; Aishwarya Thackeray Shines | Sakshi
Sakshi News home page

OTT: తొలి పార్ట్ థియేటర్లలో.. రెండోది ఇప్పుడు ఓటీటీలోకి

Nov 14 2025 12:27 PM | Updated on Nov 14 2025 12:39 PM

Nishaanchi 2 OTT Streaming Now

బాలీవుడ్ స్టార్ దర్శకుల్లో అనుగార్ కశ్యప్ ఒకడు. 'గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్' లాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో తనదైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. రీసెంట్ టైంలో నటుడిగా మారిపోయి దక్షిణాదిలో మూవీస్ చేస్తున్న ఈయన.. బాల్ ఠాక్రే మనవడిని హీరోగా పరిచయం చేస్తూ ఓ మూవీ తీశారు. తొలి భాగం థియేటర్లలో రిలీజ్ కాగా ఇప్పుడు రెండో భాగం ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.

(ఇదీ చదవండి: నా కొడుకు ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా?: గిరిజా ఓక్)

బాల్ ఠాక్రే మనవడు ఐశ్వరీ ఠాక్రే హీరోగా నటించిన సినిమా నిశాంచి. ఇందులో ఐశ్వరీ ద్విపాత్రాభినయం చేశాడు. వేదిక పింటో హీరోయిన్‌గా చేసింది. సెప్టెంబరు 19న థియేటర్లలో 'నిశాంచి' రిలీజ్ కాగా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఇ‍ప్పుడు ఓటీటీలోకి ఆ మూవీ వచ్చింది. అయితే రెండో భాగం థియేటర్లలోకి వస్తుందనుకంటే నేరుగా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఈ రోజు(నవంబరు 14) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది.

'నిశాంచి' విషయానికొస్తే.. కాన్ఫూర్‌లో జబర్దస్త్ సింగ్ అనే బిల్డర్ ఉంటాడు. కుస్తీ పోటీల్లో పాల్గొనాలనేది ఇతడి కల. కానీ ఓ గొడవలో చిక్కుకోవడంతో ఇతడిని హత్య చేస్తారు. అతడి కొడుకులు ఇద్దరి కథే ఈ సినిమా. తండ్రిని హత్య చేయడంతో కొడుకులు ఇద్దరు ఏం చేశారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. క్రైమ్ డ్రామా మూవీస్ అంటే ఇష్టముంటే ఇది మీకు నచ్చేయొచ్చు. తొలి భాగంలో కాస్త సాగదీత సీన్స్ ఉన్నప్పటికీ.. మంచి ట్విస్ట్‌తో తొలి భాగాన్ని ముగించారు. మరి రెండో భాగం ఎలా ఉందో చూడాలి? ప్రస్తుతం ఈ రెండు సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లో హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: నా యాక్టింగ్‌పై నాకే డౌట్‌: దుల్కర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement