సత్యదేవ్‌ కృష్ణమ్మ మూవీ.. అంచనాలు పెంచేసిన ట్రైలర్! | Satyadev's Krishnamma Movie Trailer Released | Sakshi
Sakshi News home page

Krishnamma Trailer: 'కొన్ని మలుపుల్లో సుడులు ఉంటాయ్'.. ఆసక్తిగా ట్రైలర్!

May 2 2024 10:26 AM | Updated on May 2 2024 12:00 PM

Satyadev's Krishnamma Movie Trailer Released

టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ నటించిన తాజా చిత్రం కృష్ణమ్మ. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాను కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఈ మూవీలో అతీరా రాజ్‌  హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఈనెల 10న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్‌ రావిపూడి, గోపీచంద్‌ మలినేని ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్‌ రిలీజ్ చేశారు. 
తాజాగా రిలీజైన ట్రైలర్‌ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓకేసులో సత్యదేవ్‌ను అన్యాయంగా ఇరికిస్తారు.. అతను ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్‌లో కథ నడకకైనా.. నది నడకకైనా మలుపులే అందం.. కానీ కొన్ని మలుపుల్లో సుడులు ఉంటాయ్.. అంటూ సత్యదేవ్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ట్రైలర్‌లో సత్యదేవ్‌ యాక్షన్‌ సీన్స్‌ ఆకట్టుకుంటున్నాయి. మరీ సత్య ఖాతాలో కమర్షియల్ హిట్ పడుతుందా? లేదా అన్నది వేచి చూడాల్సిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement