Oke Oka Jeevitham: ఓటీటీకి ఒకే ఒక జీవితం మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Sarwanand Movie Oka Oka Jeevitham Streaming On Sony LIV From October 20 - Sakshi

శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్  దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా  సెప్టెంబర్‌ 16న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అక్కినేని అమల శర్వానంద్‌ తల్లి పాత్రలో కీలక పాత్రలో నటించారు. మదర్‌సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 

తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్‌లో ఈనెల 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలోనూ 'కణం' పేరుతో విడుదలైంది. ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి, నాజర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top