The Legend Pre Release Event: Arul Saravanan Speech Goes Viral - Sakshi
Sakshi News home page

Arul Saravanan Speech: 'లెజెండ్‌'గా మారిన ఓ కామన్‌మేన్‌ కథ..

Jul 25 2022 9:12 AM | Updated on Jul 25 2022 11:35 AM

Saravanan Speech In The Legend Pre Release Event - Sakshi

‘‘చిన్నప్పటి నుంచి సినిమాలు, యాక్టింగ్‌పై ఆసక్తి ఉంది. కానీ మా లైఫ్‌స్టైల్, బిజినెస్‌ వేరు. బిజినెస్‌లో సక్సెస్‌ అయ్యాను. ఇప్పుడు అవకాశం రావడంతో ఈ సినిమా చేశాను. నటనకు వయసు అనేది అడ్డంకి కాదని భావిస్తున్నాను’’ అని శరవణన్‌ అన్నారు. శరవణన్‌ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ది లెజెండ్‌’. జేడీ–జెర్రీ ద్వయం తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌటేలా హీరోయిన్‌గా నటించారు. ఈ నెల 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్‌ కానుంది. తెలుగులో నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు.

హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో శరవణన్‌ మాట్లాడుతూ.. ‘‘ఓ కామన్‌మేన్‌ ఎలా లెజెండ్‌గా ఎదిగాడు ? జీవితంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు ? అన్నదే లెజెండ్‌ కథ’’ అని తెలిపారు. ‘‘శరవణన్‌గారు సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌మేన్‌. అయితే ఒక నటుడిగా ఆయన కమిట్‌మెంట్‌ ఎంత బాగుందనేది స్క్రీన్‌పై చూస్తారు’’ అన్నారు దర్శకద్వయం జెడీ, జెర్రీ. ‘‘తెలుగు ప్రేక్షకులు కొత్త కంటెంట్‌ను ఎప్పుడూ ఆదరిస్తారు. ‘ది లెజెండ్‌’ కథ కొత్తది. ఒక సక్సెస్‌ఫుల్‌ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి’’ అని ఎన్వీ ప్రసాద్‌ పేర్కొన్నారు.     

చదవండి: తన సినిమానే చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్‌..
ఫ్యాన్స్‌ గుర్తుపట్టడంతో భయపడి పరిగెత్తిన స్టార్ హీరో..
అప్పుడెందుకు గుర్తుకు రాలేదు.. చిరుపై అమీర్ ఖాన్‌ వ్యాఖ్యలు
 నూలుపోగు లేకుండా రణ్‌వీర్‌ సింగ్‌.. మానసిక రోగి అంటూ బ్యానర్లు
శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్‌.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ

Advertisement
 
Advertisement
Advertisement