Actor Sarathkumar PR Team Responds On His Health Rumours, Deets Inside - Sakshi
Sakshi News home page

Sarathkumar: నటుడు శరత్‌కుమార్ ఆరోగ్యంపై వ‌దంతులు.. పీఆర్‌ టీం క్లారిటీ

Dec 12 2022 11:23 AM | Updated on Dec 12 2022 1:13 PM

Sarathkumar Pr Team Responds On Gossips About Actor Health - Sakshi

ప్రముఖ సినీనటుడు  శరత్‌కుమార్‌ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  డయేరియా, డీహైడ్రేషన్‌తో శరత్‌కుమార్‌ను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారని వార్తలు రావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. సోషల్‌మీడియాలోనూ శరత్‌కుమార్‌ ఆరోగ్యంపై వదంతులు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ వార్తలపై శరత్‌కుమార్‌ పీఆర్‌ టీం స్పందించింది.

చిన్నపాటి వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ఆసుపత్రికి వెళ్లారని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపింది. వైద్య పరీక్షల అనంతరం ఆయన ఇంటికి చేరుకున్నారని, సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని పీఆర్‌ టీం తెలిపింది. కాగా తెలుగు, తమిళ భాషల్లో పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించిన శరత్‌కుమార్‌కు ప్రస్తుతం వారీసు చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement