సారంగపాణి వినోదం | Sarangapani Jathakam Grand Release on April 25th | Sakshi
Sakshi News home page

సారంగపాణి వినోదం

Apr 13 2025 12:34 AM | Updated on Apr 13 2025 12:34 AM

Sarangapani Jathakam Grand Release on April 25th

‘జెంటిల్‌మన్, సమ్మోహనం’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ కలయికలో రూపొందిన మూడో చిత్రం ‘సారంగపాణి జాతకం’. ప్రియదర్శి, రూప కొడువాయూర్‌ జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా తీయాలనే నా కల ‘సారంగపాణి జాతకం’తో నెరవేరింది. ఫస్ట్‌ కాపీతో సహా సినిమా రెడీ అయ్యింది. 

సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మా చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేద్దామనుకున్నాం. అయితే బయ్యర్ల సూచన మేరకు, మరిన్ని మంచి థియేటర్ల సౌలభ్యత కోసం 25న రిలీజ్‌ చేస్తున్నాం. ‘బలగం, 35 చిన్న కథ కాదు, కోర్టు’ సినిమాలతో ప్రియదర్శి స్థాయి పెరిగింది. ‘సారంగపాణి జాతకం’తో వంద శాతం వినోదం పంచుతారాయన. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను’’ అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement