Drug Case: NCB is Going to Issue Summons to Sara Ali Khan and Shraddha Kapoor | సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్‌కు సమన్లు - Sakshi
Sakshi News home page

సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్‌కు సమన్లు..?

Sep 21 2020 1:17 PM | Updated on Sep 21 2020 2:42 PM

Sara Ali Khan And Shraddha Kapoor To Be Summoned By NCB - Sakshi

మంబై: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు విచారణలో భాగంగా సారా అలీఖాన్‌, శ్రద్దాకపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లకు ఎన్‌సీబీ సమన్లు ఇవ్వనుంది. ఈ వారంలోనే ఎన్‌సీబీ వీరికి సమన్లు ఇచ్చే అవకాశం ఉంది. కాగా బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో వెలుగు చూసిన డ్రగ్స్‌ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో‌ అధికారులు విచారించగా బాలీవుడ్‌లోని ప్రముఖుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే.  (నన్ను మీడియా వేధిస్తోంది: రకుల్‌ ప్రీత్‌)

ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ కూతురు సారా అలీ ఖాన్‌, శ్రద్ధాకపూర్‌, సిమోన్‌ ఖంబట్టా పేర్లను కూడా రియా విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. అయితే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల కారణంగా రకుల్ ప్రీత్‌ సింగ్‌ పేరును బయటకు వెల్లడించడానికి ఎన్‌సీబీ నిరాకరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో బాలీవుడ్‌ సెలబ్రిటీలకు ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 67 ప్రకారం త్వరలో సమన్లు జారీచేయనున్నట్లు సమాచారం.  (సుశాంత్‌కు అరుదైన నివాళి...)

Advertisement
 
Advertisement
Advertisement