ప్రతి కథకు పలు కోణాలు ఉంటాయి  | Sakshi
Sakshi News home page

ప్రతి కథకు పలు కోణాలు ఉంటాయి 

Published Fri, Nov 10 2023 3:37 AM

Sapta Sagaradaache Ello Side B release date out - Sakshi

రక్షిత్‌ శెట్టి హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘సప్తసాగరదాచే ఎల్లో: సైడ్‌ బి’. హేమంత్‌ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్, చైత్ర జె. ఆచార్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ ఏడాది విడుదలైన ‘సప్తసాగరదాచే ఎల్లో: సైడ్‌ ఏ’ సినిమాకు ఇది సీక్వెల్‌. ‘సప్తసాగరదాచే ఎల్లో: సైడ్‌ బి’ సినిమాను తెలుగులో ‘సప్తసాగరాలుదాటి సైడ్‌ బి’గా టీజీ విశ్వప్రసాద్‌ , వివేక్‌ కూచిభొట్ల ఈ నెల 17న విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశానికి ఓ అతిథిగా హాజరైన అవసరాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘ప్రతి కథకు పలు కోణాలు ఉంటాయి. ‘సైడ్‌ ఏ’లో కనిపించని కోణాలు ఏమైనా ‘సైడ్‌ బి’లో కనిపిస్తాయా? అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ‘‘సప్తసాగరాలు దాటి సైడ్‌ ఏ’కు లభించిన ప్రేక్షకాదరణ ‘సైడ్‌ బి’కి కూడా లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మరో అతిథి కేవీ అనుదీప్‌.

రక్షిత్‌శెట్టి మాట్లాడుతూ– ‘‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లీ’, ‘సప్త సాగరాలు దాటి సైడ్‌ ఎ’ చిత్రాలపై తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమ, ఆదరణ ‘సప్త సాగరాలు దాటి సైడ్‌ బి’కి కూడా లభిస్తాయని ఆశిస్తున్నాను’ అన్నారు. ‘‘నా జీవితంలో తారసపడిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ‘సప్త సాగరాలు దాటి..’ సినిమా కథ రాసుకున్నాను’’ అన్నారు హేమంత్‌ రావు. ‘‘సప్తసాగరాలు దాటి: సైడ్‌ ఏ’కు లభించినట్లే ‘సైడ్‌ బి’కీ ప్రేక్షకాదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు వివేక్‌ కూచిభొట్ల.

Advertisement
 
Advertisement
 
Advertisement