‘వడకుపట్టి రామసామి’గా సంతానం 

Santhanam Next Movie Started Title As Vadakkupatti Ramasamy - Sakshi

తమిళ సినిమా: నటుడు సంతానం తాజా చిత్రం కిక్‌ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ఆయన నూతన చిత్రానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం మంగళవారం చెన్నైలో పూజ కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. దీనికి వడకుపట్టి రామసామి అనే టైటిల్‌ నిర్ణయించారు. కార్తీక్‌ యోగి దర్శకత్వం వహిస్తున్నారు. సంతానం, దర్శకుడు కార్తీక్‌ యోగి కాంబినేషన్‌లో ఇంతకుముందు డిక్కిలూన అనే సక్సెస్‌ఫుల్‌  చిత్రం వచ్చింది. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సంస్థ అధినేతలు ఇంతకుముందు తెలుగులో గూఢాచారి వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించి కోలీవుడ్‌లో రంగ ప్రవేశం చేశారు. ఇక్కడ ఇప్పటికే విట్నెస్, సాలా వంటి  వైవిధ్యభరిత కథా చిత్రాలను నిర్మించారు. తాజాగా సంతానం కథానాయకుడిగా వాడకుపట్టి రామసామి చిత్రం చేస్తున్నారు. దీని గురించి క్రియేట్‌ ప్రొడ్యూసర్‌ వి. శ్రీ నటరాజ్‌ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు వివిధ జానర్లలో కమర్షియల్‌ అంశాలతో కూడిన మంచి వినోదభరితమైన కథా చిత్రాలను అందించాలని తమ ప్రధాన ఉద్దేశం అన్నారు. సంతానం నటించిన డిక్కీలూన చిత్రాన్ని చూశామన్నారు. దీంతో దర్శకుడు కార్తీక్‌ యోగి ఈ చిత్రకథ చెప్పగానే నచ్చిందన్నారు.

వైద్య భరిత కథా చిత్రాలకు తమిళనాడులో మంచి ఆదరణ లభిస్తుందన్నారు. దర్శకుడు చెప్పిన కథకు ఈ టైటిల్‌ యాప్ట్‌ అవుతుందని భావించామని చెప్పారు. హీరోయిన్‌ ఎంపిక జరుగుతోందని తెలిపారు. నటుడు తమిళ్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఇందులో జాన్‌ విజయ్, ఎంఎస్‌ భాస్కర్, రవి, మారన్, మొట్టె రాజేంద్రన్, నిళల్గళ్‌ రవి, శేషు, నటి జాక్యూలిన్‌ తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు. దీనికి సాన్‌ రోల్డన్‌ సంగీతాన్ని, దీపక్‌  చాయాగ్రహణను అందిస్తున్నారు.   

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top