సంక్రాంతి అంటే సినిమా ఉండాల్సిందేనా? అసలు ఈ కల్చర్ ఎప్పుడు మొదలైంది? | Sakshi
Sakshi News home page

Sankranthi Movies: పండగ సినిమా.. సరదా కాదు పెద్ద దందా.. అసలు లెక్క తెలిస్తే!

Published Mon, Jan 15 2024 3:40 PM

Sankranti Movies Culture In Telugu States Details Inside - Sakshi

అసలు సంక్రాంతి అంటే ఏంటి? బతుకు తెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిపోయిన కొడుకులు, అల్లుళ్లు, కూతుళ్లు, మనవళ్లు.. అందరూ సొంతూరికి చేరుకుని ఉన్న మూడు రోజులు సరదాగా గడపడమే అసలైన పండగ. అయితే ఈ పండగ హడావుడిలో కోళ్ల పందెలు, పిండి వంటలు చాలా కామన్. వీటితో పాటు సినిమాలు చూడటం అనేది మనకు బాగా అలవాటైపోయిన పని. అసలు సంక్రాంతి అంటే సినిమా కచ్చితంగా చూడాలా? ఇంతకీ ఈ కల్చర్ ఎప్పుడు మొదలైంది?

సంక్రాంతి సీజన్
సాధారణంగా సినిమాల్ని ప్రతి శుక్రవారం రిలీజ్ చేస్తుంటారు. ఎందుకంటే శని, ఆదివారాలు కలిసొస్తాయి. సెలవు రోజులు కాబట్టి కుర్రాళ్ల దగ్గర నుంచి ఫ్యామిలీస్ వరకు థియేటర్లకు వస్తారు. ఇక సంక్రాంతి లాంటి సీజన్ వచ్చిందంటే దాదాపు వారం పదిరోజులు అందరికీ సెలవులే. కుటుంబ సభ్యులందరూ ఒక్కచోటే ఉంటారు. కాబట్టి వీళ్లందరికీ వినోదం కావాలి. అప్పుడు అందరికీ గుర్తొచ్చేది సినిమా. అలా తెలుగు చిత్రాలకు సంక్రాంతి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సీజన్ అయిపోయింది.

(ఇదీ చదవండి: మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఈ విషయం గమనించారా? ‍)

ఎప్పుడు మొదలైంది?
1932లో తొలి తెలుగు సినిమా 'భక్త ప్రహ్లాద' రాకముందు వీధి నాటకాలు, బుర్రకథలు లాంటి వాటితో ప్రజలు ఎంటర్‌టైన్ అయ్యేవారు. ఎప్పుడైతే సినిమా కల్చర్ మొదలైందో.. బుర్రకథలు, నాటకాలు లాంటివి జనాలకు మెల్లమెల్లగా బోర్ కొట్టేశాయి. తొలుత బ్లాక్ అండ్ వైట్‌లో వచ్చిన సినిమాలు.. కాలానుగుణంగా కలర్‌లోకి మారాయి. అలా 70-80 దశకంలో నిర్మాతల ఆలోచన కూడా మారింది. సంక్రాంతి సీజన్‌ని క్యాష్ చేసుకోవడంతో పాటు సినీ ప్రేమికుల్ని అలరించొచ్చని తెలుసుకుని.. పండక్కి సినిమాలు రిలీజ్ చేయడం మొదలుపెట్టారు.

గ్యారంటీగా వచ్చే స్టార్ హీరోలు 
అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ దగ్గర నుంచి మొదలుపెడితే ప్రస్తుతం మహేశ్, ప్రభాస్ లాంటి హీరోల వరకు సంక్రాంతి సీజన్ అనేది వీళ్లకు సెంటిమెంట్ అయిపోయింది. ఇప్పుడంటే హీరోలు రెండేళ్లకొక సినిమా చేస్తున్నారు గానీ కొన్నాళ్ల ముందు వరకు సంక్రాంతికి ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలైనా కచ్చితంగా ఒక్క మూవీ అయినా రిలీజ్ చేసేవాళ్లు. అలా ప్రతిసారి పండక్కి స్టార్ హీరోల మధ్య మంచి పోటీ ఉండేది. కాకపోతే అప్పట్లో ఆరోగ్యకర వాతావరణం ఉండేది. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది!

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు)

ఇప్పుడంతా దందా
ఒకప్పుడు సంక్రాంతి సినిమా అంటే కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే. నిర్మాతలు కూడా మంచి సినిమాని రిలీజ్ చేయాలనే తాపత్రయం మాత్రమే ఉండేది. ప్రేక్షకులకు నచ్చిందా లేదా అని మాత్రమే చూసేవాళ్లు. కానీ ఇప్పుడు అంతా మారిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే సంక్రాంతికి సినిమా అనగానే.. పండగ పేరు చెప్పి టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. సగటు ప్రేక్షకుడిని దోచుకుందామని ఫిక్స్ అయిపోతున్నారు. 

అభిమానులకు అంటే మరో దారి ఉండదు కాబట్టి ఆయా స్టార్ హీరోల సినిమాలకు వెళ్తారు. మరి సామాన్యుడి సంగతేంటి? నిర్మాతలని వీళ్లని పట్టించుకోరు. ఎందుకంటే సంక్రాంతికి ఊరెళ్లినా వాళ్లు.. పండక్కి సరదా కోసం ఒక్క సినిమా అయినా చూడకపోతే ఏం బాగుంటుందిలే అని థియేటర్లకు వెళ్తారు. ఇష్టం లేకపోయినా సరే ఒక్కసారే కదా అని టికెట్ రేట్లు ఎక్కువున్నా సరే డబ్బులు ఖర్చు పెట్టి తప్పక సినిమా చూస్తున్నారు. కొన్నిసార్లు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తే.. కొన్నిసార్లు మాత్రం డిసప్పాయింట్‌మెంట్ తప్పట్లేదు!

అలాంటి సరుకు కూడా
అన్నిసార్లు అని చెప్పలేం గానీ కొన్నిసార్లు సంక్రాంతికి వచ్చే సినిమాలని గమనిస్తే.. నార్మల్ టైంలో వస్తే ఇవి ఆడుతాయా? కోట్లకు కోట్లు వసూలు చేస్తాయా అనే డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది. ఎందుకంటే గతంలో అంతంత మాత్రంగానే ఉన్న కొన్ని సినిమాలు.. సంక్రాంతి టైంలో వచ్చి హిట్టో లేదా యావరేజ్ అయిపోయిన సందర్భాలు బోలెడు. ఎందుకంటే పండగ హడావుడిలో సినిమా చూస్తున్నామనే ఆనందం తప్పితే అది ఎలాంటి మూవీ అనేది సగటు ప్రేక్షకుడు పెద్దగా పట్టించుకోరు. అలా పండగ బరిలో పాసైపోయిన సినిమాలెన్నో?

(ఇదీ చదవండి: విజయ్-రష్మిక రిలేషన్‌పై మళ్లీ రూమర్స్.. అంతా ఆ ఫొటోల వల్లే?)

Advertisement
 
Advertisement
 
Advertisement