విజయ్-రష్మిక రిలేషన్‌పై మళ్లీ రూమర్స్.. అంతా ఆ ఫొటోల వల్లే? | Sakshi
Sakshi News home page

Vijay Rashmika: రూమర్ కపుల్ విజయ్-రష్మిక మళ్లీ సీక్రెట్ ట్రిప్‌కి వెళ్లారా?

Published Sun, Jan 14 2024 7:52 PM

Vijay Devarakonda Rashmika Secret Trip To Vietnam Pics Viral - Sakshi

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల మధ్య డేటింగ్ రూమర్స్ లాంటివి చాలా తక్కువ. కానీ విజయ్ దేవరకొండ-రష్మిక గురించి మాత్రం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కొన్నిరోజుల క్రితం అలానే వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకోనున్నారని టాక్ వినపడింది. ఫిబ్రవరిలో ఉంటుందని గోలగోల చేశారు. తీరాచూస్తే అలాంటిదేం లేదని తేలింది. అయితే ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి రహస్యంగా ఫారెన్ ట్రిప్‌కి వెళ్లొచ్చారనే పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ ఫొటోల్ని చూపించి మరీ దీని గురించి మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: 'యాత్ర 2' సినిమాలో ఆ ముగ్గురి పాత్రలు కనిపించవా?)

కన్నడ బ్యూటీ రష్మిక.. విజయ్ దేవరకొండతో కలిసి తొలిసారి 'గీతగోవిందం' మూవీలో నటించింది. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' అని మరో సినిమా చేశారు. ఈ రెండు చిత్రాల ఫలితం ఏంటనేది పక్కనబెడితే వీళ్ల మధ్య కెమిస్ట్రీ.. అభిమానులకు తెగ నచ్చేసింది. అదే టైంలో వీరిద్దరి గురించి డేటింగ్ రూమర్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. గతంలో మాల్దీవుల్ ట్రిప్‌కి కలిసి వెళ్లారని కొన్ని ఫొటోలతో సహా వైరల్ చేశారు.

తాజాగా కొన్ని రోజుల క్రితం విజయ్ దేవరకొండ కొన్ని ఫొటోలు పోస్ట్ చేశాడు. అది టూర్ అని తెలుస్తోంది కానీ ప్లేస్ ఎక్కడ అనేది అర్థం కాలేదు. ఇకపోతే తాజాగా రష్మిక కొన్ని ఫొటోల్ని పోస్ట్ చేసింది. ఇవన్నీ వియత్నాంలో దిగిన పిక్స్ అన్నట్లు పేర్కొంది. ఇప్పుడు వీళ్లిద్దరూ ఫొటోల్ని కాస్త అబ్జర్వ్ చేసిన కొందరు నెటిజన్స్.. విజయ్-రష్మిక కలిసి ఈ ట్రిప్‌కి వెళ్లారని, అది కూడా సీక్రెట్‌గా అని మాట్లాడుకుంటున్నారు. ఇందులో నిజమేంటనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: రెండో రోజుకే భారీగా తగ్గిపోయిన 'గుంటూరు కారం' కలెక్షన్స్)

 
Advertisement
 
Advertisement