'యాత్ర 2' సినిమాలో ఆ ముగ్గురి పాత్రలు కనిపించవా? | Sakshi
Sakshi News home page

Yatra 2 Movie: 'యాత్ర 2' సినిమాలో ఆ ముగ్గురి రోల్స్ ఉండవా?

Published Sun, Jan 14 2024 6:21 PM

Sharmila Pawan Kalyan Nara Lokesh Roles Not Included Yatra 2 Movie - Sakshi

ఈ ఏడాది రాబోయే ఆసక్తికర సినిమాల్లో 'యాత్ర 2' ఒకటి.  రాజకీయాల్లో పోరాట పటిమతో తిరుగులేని ప్రజా నాయాకుడిగా ఎదిగిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా ఈ మూవీ తీశారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడిగా.. ఇచ్చిన మాట కోసం ఆయన చేసిన అసాధారణ పాదయాత్ర, రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పాయనే కథతో దర్శకుడు మహి వి.రాఘవ్ ఈ చిత్రాన్ని తీశారు. ప్రజా సంక్షేమం, తండ్రి ఆశయ సాధన కోసం వై.ఎస్.జగన్ తన ప్రామిస్‌ని ఎలా నిలబెట్టుకున్నారనేది ఈ సినిమా.

అయితే 'యాత్ర 2' సినిమాలోని ప్రధాన పాత్రలు గురించి ఇప్పటికే మేకర్స్ రివీల్ చేశారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, వై.ఎస్.జగన్ పాత్రలో తమిళ స్టార్ హీరో జీవా నటించారు. వై.ఎస్.భారతి రోల్‌లో కేతికా నారాయణన్, నారా చంద్రబాబు నాయుడు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియా గాంధీ పాత్రలో సుసాన్నె బెన్నెట్ తదితరులు కనిపించనున్నారు. అయితే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వై.ఎస్.షర్మిల పాత్రల్లో ఎవరు నటించారనే విషయం ఇంట్రెస్టింగ్‌గా మారింది. 

(ఇదీ చదవండి: రెండో రోజుకే భారీగా తగ్గిపోయిన 'గుంటూరు కారం' కలెక్షన్స్)

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు 'యాత్ర 2'లో  వీళ్ల ముగ్గురి పాత్రలు ఉండవట. తండ్రి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టటానికి జగన్ చేసిన పోరాటం, తండ్రీ కొడుకుల మధ్య అనుబంధంలోని భావోద్వేగాన్ని ఆవిష్కరిస్తూ వై.ఎస్.జగన్ చేసిన పాదయాత్ర గురించి మాత్రమే ఈ చిత్రాన్ని దర్శకుడు తీశారు.  ఇకపోతే వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా 'యాత్ర' తీశారు. 

ఇప్పుడు 2009 నుంచి 2019 వరకు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా 'యాత్ర 2' సినిమాని తెరకెక్కించారు. రీసెంట్‌గా విడుదలైన మూవీ టీజర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆ తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే)

Advertisement
Advertisement