మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఈ విషయం గమనించారా? ‍ | Sakshi
Sakshi News home page

గ్రాండ్‌గా పండగ చేసుకున్న మెగా ఫ్యామిలీ.. ఈసారి మాత్రం చాలా స్పెషల్

Published Mon, Jan 15 2024 3:23 PM

Mega Family Sankranti Celebration 2024 Latest Pic Viral - Sakshi

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సరే సంక్రాంతి హడావుడి కనిపిస్తోంది. పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్లు, ముసలోళ్ల వరకు ప్రతి ఒక్కరు పండగని ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరూ ఒక్కచోటకు చేరి అసలైన సంక్రాంతిని జరుపుకొంటున్నారు. అయితే మెగా ఫ్యామిలీ కూడా గ్రాండ్‌గా ఈ పండగని సెలబ్రేట్ చేసుకుంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు)

అయితే గతంతో పోలిస్తే ఈసారి సంక్రాంతి మెగా ఫ్యామిలీకి చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రామ్ చరణ్ కూతురి క్లీంకారకు ఇదే తొలి పండగ. అలానే గతేడాది నవంబరులో పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి దంపతులకు కూడా ఇదే తొలి సంక్రాంతి కావడం విశేషం.

ఇకపోతే సంక్రాంతిని మెగా ఫ్యామిలీ.. బెంగళూరులోని ఫామ్ హౌసులో జరుపుకొంది. రెండు రోజుల క్రితం అందరూ అక్కడికి వెళ్లిపోయారు. ఇకపోతే ఈ వేడుకల్లో పవన్ కల్యాణ్ తప్పితే దాదాపు మెగా-అల్లు కుటుంబ సభ్యులు కనిపించారు. ఈ ఫొటో చూస్తుంటే మెగా అభిమానులకు రెండు కళ్లు సరిపోవట్లేదు. అలానే మగవాళ్లు అందరూ లైట్ బ్రౌన్ కలర్ కుర్తా వేసుకోగా.. ఆడవాళ్లు అందరూ ఎర్ర చీరల్లో కనిపించారు. 

(ఇదీ చదవండి: విజయ్-రష్మిక రిలేషన్‌పై మళ్లీ రూమర్స్.. అంతా ఆ ఫొటోల వల్లే?)

Advertisement
Advertisement