శుభవార్త చెప్పిన 'ప్రేమలు' కమెడియన్ | Premalu Star Sangeeth Prathap Announces First Pregnancy With Wife, Watch Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Sangeeth Prathap: తండ్రి కాబోతున్న కమెడియన్.. వీడియో వైరల్

Jul 5 2026 2:46 PM | Updated on Jul 5 2026 5:27 PM

Sangeeth Prathap Soon To Be Father And His Wife Pregnant

ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అలానే పలువురు సెలబ్రిటీలు శుభవార్తలు కూడా చెప్పేస్తున్నారు. కొన్నిరోజుల క్రితమే దర్శకుడు నాగ్ అశ్విన్ మరోసారి తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు 'ప్రేమలు' కమెడియన్ కూడా ఇలాంటి గుడ్ న్యూస్ చెప్పేశాడు. తన భార్య ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉందని పోస్ట్ పెట్టాడు.

(ఇదీ చదవండి: పెళ్లిరోజు గిఫ్ట్‌గా విడాకుల నోటీసులు: హీరోయిన్)

స్వతహాగా ఎడిటర్ అయిన సంగీత్ ప్రతాప్.. 2019 నుంచి మలయాళ ఇండస్ట్రీలో ఉన్నాడు. అయితే 2022లో వచ్చిన 'హృదయం' మూవీలో చిన్న పాత్రలో నటించాడు. అయితే తెలుగులోను డబ్బింగ్ అయిన 'ప్రేమలు' చిత్రం సంగీత్ కెరీర్ మలుపు తిప్పింది. ఇందులో అమూల్ డేవిస్ అనే పాత్రలో తెగ నవ్వించాడు. అలా నటుడిగా స్థిరపడిపోయాడు.

2023 నవంబరులో ఆన్సీని పెళ్లి చేసుకున్న సంగీత్ ప్రతాప్.. ప్రస్తుతం ఫ్యామిలీ, కెరీర్ పరంగా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు తాను తండ్రి కాబోతున్న సంగతి ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేసి ప్రకటించాడు. దీంతో మమిత బైజు, నస్లేన్ తదితరులు ఇతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: ప్రియురాలితో అమిర్ ఖాన్ మూడో పెళ్లి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement