Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

After Puja Khedkar, Ex-IAS Officer Abhishek Singh Under Fire Over Disability Claim
పూజా ఖేడ్కర్‌ తర్వాత మరో ఐఏఎస్‌.. వివాదాల్లో బ్యూరోక్రాట్లు!

దేశంలో బ్యూరోక్రాట్స్‌ నియామకంపై వరుస వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌ నియామకంపై వివాదం నెలకొంది. ఐఏఎస్‌ గట్టెక్కేందుకు ఆమె పలు నకిలీ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై దృష్టిసారించిన ప్రధాని మోదీ కార్యాలయం అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.ఈ తరుణంలో తాజాగా మరో మాజీ ఐఏఎస్ అభిషేక్‌ సింగ్‌ సైతం నకిలీ వైకల్య ధృవీకరణ పత్రాలతో యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్లు తెలుస్తోంది. Downfall of UPSC has already begun with Pooja Pooja khedkar, followed by this Abhishek Singh.The main guy dancing has cleared UPSC under Locomotor Disability (PwBD-3) category.For those who don't know what is PwBD-3- Cerebral palsy, Leprosy-cured, Dwarfism, Acid attack… pic.twitter.com/osPKbhs2jc— ShoneeKapoor (@ShoneeKapoor) July 13, 2024అభిషేక్‌ సింగ్‌ 2011 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. యాక్టింగ్‌పై మక్కువతో గతేడాది ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే ఐఏఎస్‌ అధికారిగా ఉండగానే అతడు వ్యాయామం చేస్తున్న వీడియోలు కొన్ని వెలుగులోకి రావడంతో వివాదం మొదలైంది. కదలికలకు సంబంధించి శారీరక వైకల్యం (లోకో మోటర్‌ డిసెబిలిటీ) ఉన్నట్లు సర్టిఫికెట్లు సమర్పించడం... ఆ సర్టిఫికెట్ల ఆధారంగానే అతడికి దివ్యాంగుల కోటా కింద యూపీఎస్సీ నియామకం జరగడం గమనార్హం. పీడబ్ల్యూబీడీ3 అని పిలిచే ఈ కేటగిరి కింద ఆసిడ్‌ దాడి బాధితులు మొదలుకొని కండరాల కదలికల్లేని సెర్రబెల్‌ పాల్సీ వ్యాధిగ్రస్తులు, కుష్టు వ్యాధి నుంచి బయటపడ్డవారు. మరుగుజ్జులుగా మిగిలిపోయిన వారు వస్తారు. ఈ కోటా కింద ఐఏఎస్‌ అయిన అభిషేక్‌ సింగ్‌ జిమ్‌లో ఎంచక్కా వ్యాయామాలు చేస్తున్న వీడియోలు బయటపడటంతో యూపీఎస్సీ నియామకాలపై సర్వత్రా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పీడబ్ల్యూబీడీ3 కోటా కిందే ఐఏఎస్‌లో 94వ ర్యాంక్‌ను సాధించడంతో చర్చాంశనీయమైంది.రిజర్వేషన్లకు సపోర్ట్‌ చేశాననేతాను ఐఏఎస్‌ సాధించడంపై వస్తున్న ఆరోపణలపై అభిషేక్‌ సింగ్‌ స్పందించారు. రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చినందుకు తనను టార్గెట్ చేస్తున్నారని అన్నారు.కష్టపడి ఐఏఎస్‌ సాధించా‘ఇప్పటి వరకు నేను ఎలాంటి విమర్శలు రాలేదు. అయినప్పటికీ నా మద్దతు దారులు అడిగినందుకే ప్రస్తుతం నేను ఐఏఎస్‌ ఎలా అయ్యారనే ప్రశ్నకు బదులిస్తున్నాను. నేను రిజర్వేషన్‌లకు సపోర్ట్‌ చేయడం ఎప్పుడైతే ప్రారంభించానో అప్పటి నుంచి రిజర్వేషన్లు వ్యతిరేకించేవారు నన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారు. నేను ఎంతో కష్టపడి, ధైర్యంతో ఉన్నత స్థాయికి చేరుకుంటున్నాను.రిజర్వేషన్ ద్వారా కాదు’అని ఎక్స్‌ వేదికపై ట్వీట్‌ చేశారు. भाई दुनिया भर की कहानी लिख दी बस ये नही बताया की कैसे LD जिसके वजह से आपने दिव्यांग कोटा लगाया और IAS बने वो होते हुए भी जिम में वजन उठा रहे हो? थोड़ा ज्ञान साझा कर दो, डॉक्टर भी अध्यन करके दुसरे मरीजों की मदद कर देंगे। pic.twitter.com/EXnFzFD7Us— Roshan Rai (@RoshanKrRaii) July 13, 2024 టాలెంట్‌ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలతో పనిలేదు‘ప్రభుత్వ సహాయం లేకుండా యునైటెడ్ బై బ్లడ్, నో షేమ్ మూవ్‌మెంట్ వంటి నా కార్యక్రమాల ద్వారా సామాజిక సేవ చేశాను. ప్రభుత్వ ఉద్యోగాల్లో జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని నేను నమ్ముతున్నాను, ఆ దిశగా కృషి చేస్తాను. మీకు ప్రతిభ ఉందని భావిస్తే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించడం మానేయండి. వ్యాపారం, క్రీడలు లేదా నటనలో రాణించండి’ అని పిలుపునిచ్చారు. పూజా ఖేడ్కర్‌ ఐఏఎస్‌ పోస్ట్‌కు ఎసరుట్రైయినీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. యూపీఎస్సీకి సమర్పించిన అఫిడవిట్‌లో ఖేడ్కర్‌ తన చూపు, మానసిక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. కానీ వాటిని నిర్ధారించడానికి తప్పనిసరి వైద్య పరీక్షలకు హాజరు కావాల్సింది. కానీ ఆమె హాజరు కాలేదు. ఐఏఎస్‌లో ఉత్తర్ణీత సాధించారు. కాగా, పూజా ఖేడ్కర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణకు కేంద్రం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. విచారణలో పూజా దోషిగా తేలితే ఆమెను తొలగించే అవకాశం ఉందని సమాచారం. వాస్తవాలను దాచిపెట్టడం, తప్పుగా సూచించడం వంటి ఆరోపణలు నిజమని తేలితే క్రిమినల్ చర్యలు కూడా ఎదుర్కోనున్నారు.

Minister Ponnam Comments On Brs Mlas Defection
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేరిక అందుకే: మంత్రి పొన్నం

సాక్షి,కరీంనగర్ జిల్లా: ప్రభుత్వ సుస్థిరత కోసమే కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చేరుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం(జులై 15) కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో జరిగిన వన మహోత్సవంలో మొక్కలు పొన్నం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేరికపై మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలో బీజేపీ ఎన్ని ప్రభుత్వాలు కూల్చింది..? బండి సంజయ్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. బీజేపీ కూల్చిన ప్రభుత్వాల్లో ఎంత మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు..? ప్రభుత్వాన్ని కూల్చుతామంటే.. చూస్తూ ఊరుకోవాలా..? మేం ధర్మం తప్పలేదు. కులగణనపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. డిసెంబర్ 3 వరకు మాకు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలన్న ఆలోచనే లేదు. తర్వాత పరిస్థితుల్లోనే చేర్చుకుంటున్నాం’అని పొన్నం తెలిపారు.

TDP Demolished YSRCP Leader Dhaba at Vaikuntapuram Chandragiri
టీడీపీ శ్రేణుల అరాచకాలు..వైఎస్సార్‌సీపీ అభిమాని ధాబా కూల్చివేత

సాక్షి,తిరుపతి : టీడీపీ అరాచకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం వైకుంఠపురంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. వైకుంఠ పురం వద్ద అనంత గుర్రప్ప గారిపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత మేడసాని ప్రవీణ్ కుమార్‌కు చెందిన మేడసాని ధాబాను టీడీపీ శ్రేణులు కూల్చేశారు. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో జేసీబీతో ఈ కూల్చివేతకు పాల్పడ్డారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి,హార్డ్ డిస్కులను ఎత్తుకెళ్లారు. ధాబా కూల్చివేతపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ధాబా విధ్వసంపై వైఎస్సార్‌సీపీ నేతలు ప్రవీణ్‌ను పరామర్శిస్తున్నారు. టీడీపీ శ్రేణుల విధ్వంసంపై సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సోదరుడు చెవిరెడ్డి రఘు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్‌ను పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హామీ ఇచ్చారు. కాగా, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనలతో టీడీపీ శ్రేణులు జేసీబీతో కూల్చేసిన ధాబాను చంద్రగరి సీఐ రామయ్య పరిశీలించారు. ప్రాథమిక వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Gold And Silver Price Today 15 July 2024
తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

గత రెండు రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు కొంత తగ్గుముఖం పట్టాయి. దీంతో నేడు (జులై 15) పసిడి ధరలు గరిష్టంగా రూ. 110 తగ్గింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67500 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73650 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గినట్లు తెలుస్తోంది.ఢిల్లీలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గింది. కాబట్టి ఈ రోజు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67650 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73790 వద్ద ఉంది.హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో మాత్రమే కాకుండా చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు తగ్గాయి. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 67850 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 74020 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరల కంటే ఈ రోజు వరుసగా రూ. 200, రూ. 220 తగ్గినట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ వెండి ధర మునుపటికంటే రూ. 300 తగ్గింది. దీంతో కేజీ వెండి కొనుగోలు చేయాలంటే రూ. 95200 వెచ్చించాల్సి ఉంటుంది. మూడు రోజులు తర్వాత మళ్ళీ వెండి ధర తగ్గింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

who is Thomas Matthew Crooks
ట్రంప్‌పై కాల్పులకు తెగబడింది ఈ యువకుడే.. ఫొటో విడుదల చేసిన ఎఫ్‌బీఐ

వాషింగ్టన్ డీసీ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పులకు తెగబడ్డ నిందితుడు 20ఏళ్ల థామస్‌ మ్యాథ్యు క్రూక్స్‌ ఫొటోని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ)అధికారికంగా విడుదల చేసింది.గత శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో అమెరికాలోని పెన్సిల్వేనియా ప్రావిన్స్‌లోని బట్లర్‌ పట్టణంలో డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఆ ప్రసంగం వేదికగా ఎదురుగా ఓ బిల్డింగ్‌పై నుంచి నిందితుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్‌ చెవికి తీవ్రగాయమైంది.కాల్పుల అనంతరం క్రూక్స్‌ తప్పించుకునేందుకు ఒక బిల్డ్‌పై నుంచి మరో బిల్డింగ్‌పైకి దూకుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా ట్రంప్‌ను నీడలా నిత్యం వెంట ఉండే సీక్రెట్‌ ఏజెంట‍్లు సెకన్ల వ్యవధిలో మట్టుబెట్టడంతో ప్రాణాపాయమే తప్పింది. ఈ ఉదంతం తర‍్వాత నిందితుడు ఈ దాడికి ఎందుకు పాల్పడ్డాడు? దాడికి గల కారణాల గురించి తెలుసుకునే పనిలో పడ్డారు ఎఫ్‌బీఐ అధికారులు.. ఇందులో భాగంగా నిందితుడి ఫొటోని విడుదల చేశారు.ఈ సందర్భంగా సీక్రెట్‌ ఏజెంట్ల కాల్పులతో మరణించిన క్రూక్స్‌ డెడ్‌ బాడీ పక్కనే అసాల్ట్‌ రైఫిల్‌ ఏ-15 ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌బీఐ వెల్లడించింది.క్రూక్స్‌ చదువుకున్న బెతెల్ పార్క్ హై స్కూల్లో చురుకైన విద్యార్ధిగా పేరు సంపాదించాడు. స్కూల్‌లో నిర్వహించిన నేషనల్‌ మ్యాథ్స్‌, సైన్స్‌ ఇన్షియేటీవ్‌ కాంపిటీషన్‌లో 500 డాలర్ల ప్రైజ్‌మనీని దక్కించుకోవడం గమనార్హం.నవంబర్‌ 5 న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం తొలిసారి తన ఓటు వినియోగించుకునేందుకు క్రూక్స్‌ తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇక స్కూల్స్‌ ఫ్రెండ్స్‌ క్రూక్స్‌ ఎప్పుడూ ఒంటరిగా ఉంటాడని, రాజకీయాలు గురించి, లేదంటే ట్రంప్‌ గురించి ఎప్పుడు ప్రస్తావనకు వచ్చిన దాఖలాలు లేవని వారు స్థానిక మీడియతో మాట్లాడారు. కానీ నిందితుడు స్కూల్లో వేధింపులకు గురైనట్లు చెప్పగా.. ఎఫ్‌బీఐ అధికారులు ఆ కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.

R Parthiban Says He Wants To Quit Movies Of Teenz Not Get Success
ఈ సినిమా సక్సెస్‌ కాకపోతే ఇండస్ట్రీ వదిలేసి పోదామనుకున్నా!

డిఫరెంట్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ పార్థిబన్‌. ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ముందుండే ఈయన దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగానూ సుపరిచితులే. భారతి కన్నమ్మ (తమిళ) సినిమాకు ఉత్తమ నటుడిగా తమిళనాడు రాష్ట్ర సినీ పురస్కారం అందుకున్నాడు. యుగానికి ఒక్కడు మూవీలో చోళరాజుగా నటించి ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డు గెలుచుకున్నాడు. కొత్త సినిమారచ్చ, పొన్నియన్‌ సెల్వన్‌ 1, 2 చిత్రాలతో తెలుగువారికీ దగ్గరయ్యాడు. పుదియ పాదై, హౌస్‌ఫుల్‌, ఇవన్‌, విటగన్‌, ఒత్త సెరుప్పు సైజ్‌ 7, ఇరవిన్‌ నిడల్‌ సినిమాలతో దర్శకనిర్మాతగానూ సత్తా చాటాడు. ఈయన తెరకెక్కించిన తాజా చిత్రం టీన్జ్‌. ఈ మూవీలో పార్థిబన్‌ కీలక పాత్రలో నటించగా ఆయన కుమార్తె కీర్తన క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా పని చేసింది. జూలై 12న తమిళనాట రిలీజైన ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా పార్థిబన్‌ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు.ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదామనుకున్నా'ఫ్రెండ్స్‌.. టీన్జ్‌ సినిమాకు పిల్లలు, కుటుంబాల నుంచి మంచి స్పందన రాకపోతే నా ఊపిరిగా భావించిన సినిమాను వదిలేద్దామనుకున్నాను. ఇండస్ట్రీ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోదామనుకున్నాను. కానీ మీరు నాకు ఆ ఛాన్స్‌ ఇవ్వలేదు. సినిమాను ఆదరిస్తున్నారు. థాంక్యూ' అని ట్వీట్‌ చేశాడు. అయితే కాసేపటికే ఆ ట్వీట్‌ డిలీట్‌ చేయడం గమనార్హం. The wait is over!TEENZ from Today in cinemas worldwide@rparthiepan@immancomposer@dopgavemic@k33rthana@GenauRanjith@lramachandran@AdithyarkM@Iam_Nithyashree@shreyaghoshal@Arivubeing@iYogiBabu@onlynikil@j_prabaahar@shrutihaasan@CVelnambi@teenzmovieoffl… pic.twitter.com/F0hbYzxCaH— Radhakrishnan Parthiban (@rparthiepan) July 12, 2024 చదవండి: ఆ సినిమా చేస్తే కెరీర్‌ ముగిసినట్లేనని వార్నింగ్‌.. అయినా వినలేదు!

Euro 2024: List of award winners, prize money and key numbers
యూరో కప్‌ విజేతగా స్పెయిన్‌.. ప్రైజ్‌ మనీ ఎన్ని వందల కోట్లంటే?

దాదాపు నెల రోజుల పాటు ఫుట్‌బాల్‌ అభిమానులను ఉర్రూతలూగించిన యూరో కప్‌-2024కు ఎండ్‌ కార్డ్‌ పడింది. ఆదివారం రాత్రి స్పెయిన్‌- ఇంగ్లండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌తో ఈ టోర్నీ ముగిసింది. యూరోకప్‌ విజేతగా స్పెయిన్‌ నిలిచింది.ఫైనల్లో 2-1 తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించిన స్పెయిన్‌.. నాలుగో సారి టైటిల్‌ను ముద్దాడింది. ఈ క్రమంలో విజేత స్పెయిన్‌ ప్రైజ్‌ మనీ ఎంత? రన్నరప్‌ ఇంగ్లండ్‌కు ఎంత దక్కుతుంది? ప్లేయర్‌ ఆఫ్‌ది టోర్నీ ఎవరన్న ఆంశాలపై ఓ లుక్కేద్దాం.విజేత స్పెయిన్‌కు ఎన్ని కోట్లంటే?యూరో కప్‌ విజేత స్పెయిన్‌కు ప్రైజ్‌ మనీ రూపంలో మొత్తం 30.4 మిలియన్‌ డాలర్లు అందనుంది. అంటే భారత కరెన్సీలో సుమారుగా రూ. 253 కోట్ల ప్రైజ్‌ మనీ స్పెయిన్‌కు దక్కింది. అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి ఛాంపియన్స్‌గా నిలిచినందుకు బోనస్‌+ గ్రూప్ స్టేజ్ విజయాలు+ క్వార్టర్-ఫైనల్ + సెమీ-ఫైనల్+ ఫైనల్+ టోర్నీలో పాల్గోనే రుసుము మొత్తం కలిపే రూ. 253 కోట్ల నగదు బహుమతిగా స్పెయిన్‌కు లభించనుంది.రన్నరప్‌ ఇంగ్లండ్‌కు ఎంతంటే?రన్నరప్‌ ఇంగ్లండ్‌కు ప్రైజ్‌ మనీ రూపంలో మొత్తం 27.25మిలియన్‌ డాలర్లు అందనుంది. అంటే భారత కరెన్సీలో సుమారుగా రూ.227 కోట్ల ప్రైజ్‌ మనీ ఇంగ్లండ్‌కు దక్కింది. గ్రూప్ స్టేజ్ విజయాలు+ క్వార్టర్-ఫైనల్ + సెమీ-ఫైనల్+ టోర్నీలో పాల్గోనే రుసుము+ రౌండ్‌ 16 మొత్తం ప్రైజ్‌మనీ కలిపి ఇంగ్లండ్‌కు రూ.227 కోట్ల నగదు బహుమతిగా అందనుంది. ఇక సెమీఫైనల్‌కు చేరిన ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌కు చెరో రూ. 101 కోట్ల ప్రైజ్‌ మనీ దక్కనుంది.యంగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ది టోర్నీ: లామిన్ యమల్ (స్పెయిన్)ఈ టోర్నీలో లామిన్ యమల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.17 ఏళ్ల యమల్ ఒక గోల్‌తో పాటు 4 అసిస్ట్‌లు చేశాడు. ఈ యువ ప్లేయర్‌ కచ్చితంగా ఫ్యూచర్‌ స్టార్‌ అవుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు.ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్: రోడ్రి (స్పెయిన్)స్పెయిన్ తరఫున మిడ్‌ఫీల్డ్‌లో రోడ్రి అదరగొట్టాడు. స్పెయిన్‌ విజేతగా నిలవడంలో రోడ్రిది కీలకపాత్ర. గోల్డెన్ బూట్ విజేతలు వీరే..యూరో కప్‌-2024 గోల్డన్‌ బూట్‌ విజేతలగా ఆరుగురు నిలిచారు. మొత్తం ఆరు మంది ఆటగాళ్లు సమంగా 3 గోల్స్‌ చేసి సంయుక్తంగా గోల్డన్‌ బూట్‌ అవార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ కేన్, స్పెయిన్ అటాకింగ్ మిడ్‌ఫీల్డర్ డాని ఓల్మో, జార్జియా మిడ్‌ ఫిల్డర్‌ జార్జెస్ మికౌతాడ్జే, కోడి గక్పో, ఇవాన్ ష్రాంజ్,జమాల్ ముసియాలా ఉన్నారు.

Huge Investment attractiveness Created In YS Jagan Govt
జగన్‌ వల్లే పెట్టుబడులు పైపైకి..

సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తన హయాంలో కనబర్చిన ప్రత్యేక శ్రద్ధతో పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ విషయంలో ఏపీ 2024 జనవరి నుంచి మార్చి వరకు 3 నెలల కాలంలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఈ సమయంలో రాష్ట్రంలోకి కొత్తగా 15 ప్రాజెక్టుల ద్వారా రూ.22,­580 కోట్ల పె­ట్టుబడులు వచ్చినట్లు డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడించింది. ఇదే సమయంలో రూ.1,02,534 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా.. రూ.36,329 కోట్ల పెట్టుబడులతో గుజరాత్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇదే కాలంలో ఏపీలో కొత్తగా 14 యూనిట్ల ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా రూ.1,049 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. నాటి సీఎం జగన్‌ ప్రత్యేక చొరవవల్లేవాస్తవానికి.. నాటి సీఎం జగన్‌ ప్రత్యేక కృషితో ఏపీలో అనువైన వాతావరణం కల్పించడంవల్లే ఈ కాలంలో కొత్త పరిశ్రమలు రాష్ట్రం వైపు ఎక్కువగా మొగ్గు చూపా­యి.ఏపీలో 4 పోర్టుల పనులు యుద్ధప్రా­తిప­దికన చేయించడం.. 10 ఇండస్ట్రి­యల్‌ నోడ్స్‌ను ప్రారంభించడం.. 10 ఫిషింగ్‌ హార్బర్ల పనులకు కూడా శ్రీకారం చుట్టడం.. ఎంఎస్‌ఎంఈలకు ఎన్నడూలేని విధంగా ప్రోత్సహించడం లాంటి అంశాలు ఏపీలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతా­వరణం ఏర్పడడానికి ప్రధాన కారణాలు. కేంద్రం సైతం ఇందుకు బలం చేకూరుస్తూ తన నివేదికల్లో ఏపీలో పరిశ్రమల ఏర్పాటును ప్రస్తావించింది. కోవిడ్‌ తర్వాత పెట్టుబడుల ఆకర్షణలో దూకుడుప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్‌ మహమ్మారి తర్వాత కాలంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, వాటిని వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్‌ దూకూడు ప్రదర్శించింది. ఈ విపత్కర సమయంలో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూత­ప­డకుండా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభు­త్వం వారిని చేయిపట్టి నడిపించడంతో పాటు పరిశ్రమలకు గతంలో చంద్రబాబు సర్కారు ఎగ్గొట్టిన బకాయిలను చెల్లించడంతో పారిశ్రామికవేత్తలకు ఏపీపై నమ్మకం ఏర్పడింది. దీంతో 2022 నుంచి 2024 మార్చి వరకు అంటే 27 నెలల కాలంలో రాష్ట్రంలోకి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఈ 27 నెలల కాలంలో రాష్ట్రంలోకి 120 సంస్థలు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నాయని, దీనికి సంబంధించి ఇండ్రస్టియల్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ మెమోరాండం (ఐఈఎం) పార్ట్‌–ఏను జారీచేసినట్లు డీపీఐఐటీ పేర్కొంది. ఈ 120 ఒప్పందాల ద్వారా రాష్ట్రంలోకి రూ.50,955 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇదే సమయంలో కొత్తగా 112 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా రూ.62,069 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయి. ఈ 112 సంస్థలు ఉత్పత్తి ప్రారంభించడంతో ఐఈఎం పార్ట్‌–బీని మంజూరుచేసినట్లు డీపీఐఐటీ ఆ నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలోకి ఈ స్థాయిలో భారీ పెట్టుబడులు రావడం ఇదే ప్రథమమని పరిశ్రమల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

YSRCP MP Vijayasai Reddy Press Meet In Visakhapatnam
నా ప్రతిష్ట దెబ్బతీసిన వారిని వదలను: ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి,విశాఖపట్నం: కూటమి రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు తాను భయపడే వాడిని కాదని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం(జులై 15) విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భయపడే ప్రసక్తేలేదన్నారు.ఐదేళ్ల తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తోక ఆడించే వారి తోకలను తాము వచ్చాక కత్తిరిస్తామని హెచ్చరించారు. ‘నా ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారు. ఆమెతో నాకు సంబంధం అంటగట్టారు. ఎలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేశారు. అసత్య కథనాలు ప్రసారం చేసినవారితో క్షమాపణలు చెప్పిస్తా. చిన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఎదిగాను. బ్లాక్‌​ మెయిల్‌ చేసి డబ్బు వసూల్‌ చేసే వ్యక్తిని కాదు. రాధాకృష్ణ, బీఆర్‌నాయుడు, వంశీకృష్ణ మాదిరి వ్యక్తిని కాదు. అన్ని హక్కుల కమిషన్‌లకు ఫిర్యాదు చేస్తా. మహాన్యూస్‌ వంశీకృష్ణను వదలను. పార్లమెంట్‌లో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ప్రవేశపెడతా. ప్రివిలేజ్‌ మోషన్‌ మూవ్‌ చేస్తా’ అని విజయసాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు. విజయసాయిరెడ్డిప్రెస్‌మీట్‌ ముఖ్యాంశాలు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై వరుస క్రమంలో బురద జల్లుతున్నారు..నాపై నిరాధార ఆరోపణలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదునా ఇంటికి టీడీపీ నాయకుడు, ఒక మహిళ వచ్చారుఇది సిసీ కెమెరాల్లో రికార్డు అయిందివిజయసాయి రెడ్డి గాడు పారిపోయాడా ఉన్నాడా అని అడిగాడువాడు టైం చెపితే నేనే వస్తాను, నేనే వాడి ఇంటికి వెళ్తానుమేము ఎవడికి భయపడేది లేదుమళ్ళీ వచ్చేది వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమేమధ్యంతర ఎన్నికలు వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందితాటాకు చపపుళ్లకు భయపడేది లేదు..ఒక ఆదివాసీ మహిళకు వ్యతిరేకంగా ప్రచారం చేశారుఆధారాలు లేని ఆరోపణలు చేశారుమహా న్యూస్, ఎబిఎన్, టీవీ 5 నాపై తప్పుడు కథనాలు ప్రచారం చేశారు.కనీసం నా వివరణ కూడా తీసుకోలేదుమీతో ఎలా క్షమాపణ చెప్పించాలో నాకు తెలుసునా వ్యక్తిత్వం ఏమిటో నాకు తెలుసురాధాకృష్ణ, బిఆర్ నాయుడు, వంశీ కృష్ణ లాగా బ్లాక్ మెయిల్ చేయడం నాకు తెలియదు..నేను తప్పు చేస్తే దేవ దేవుడు శిక్షిస్తాడుబరితెగించి హద్దులు మీరు ఆధారాలు లేకుండా ఆదివాసీ మహిళతో సంబంధం కట్టబెట్టారుఈ కుట్ర వెనుక ఉన్న వంశీ, రాధా కృష్ణ, వెంకట కృష్ణ, బిఆర్ నాయుడు, సాంబ లకు బుద్ధి చెపుతానురామోజీరావును ధైర్యంగా ఎదుర్కొన్నానువంశీ అనే వాడిపై, పరువు నష్టం దావాతో పాటు పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తాను.ఎస్టీ కమిషన్, ఉమెన్ ఆర్గనైజేషన్ ను ఫిర్యాదు చేస్తానుప్రైవేట్ మెంబర్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడతానుసహాయం కోసం వస్తే సంబంధం అంటకట్టేస్తారావయసుతో సంబంధం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తారాసాయిరెడ్డి తండ్రి లాంటి వారని ఆదివాసీ మహిళ చెప్పింది.వంశీ అమ్మ అబ్బకు పుట్టి ఉంటే ఇటువంటివి రాసే వాడు కాదుకుట్రలో భాగంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తప్పుడు ప్రచారం చేసిందిఒక సామాజిక వర్గానికి చెందిన ఛానెల్స్ నాపై తప్పుడు ప్రచారం చేశారువంశీ మీ అమ్మ అక్క చెల్లి ఎవరైనా ఇటు వంటి ఆరోపణలు చేస్తే ఇలానే డిబెట్లు పెడతావావంశీ, సాంబ, వెంకట కృష్ణ పుట్టుక మీద నాకు అనుమానం ఉందిమీకు డీఎన్ఏ టెస్ట్ లు చేయాలిబ్లీచింగ్ పౌడర్, టాల్కం పౌడర్‌కు తేడా తెలియని వ్యక్తి వంశీఓనమాలు రాని వ్యక్తి వంశీతల్లికి చెల్లికి తేడా తెలియని వ్యక్తి వంశీవంశీ ఇంట్లో ఆడవాళ్ళు మీద ఆరోపణలు చేస్తే ఆ బాధ తెలిసేదిటీవీ 5 సాంబ గురించి సంద్య శ్రీధర్ గురించి అడగాలివెంకట కృష్ణ అమ్మాయిని మోసం చేసి ఈనాడులో ఉద్యోగం పోగొట్టుకున్న వ్యక్తిఎవరో మహిళతో మహాన్యూస్‌ వంశీకి అక్రమ సంబంధం ఆటగట్టి డీఎన్ఏ టెస్ట్ అడిగితే ఎలా ఉంటుంది

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement
National View all
రామ జన్మభూమి నుంచి సీతామాత జన్మస్థలికి రైలు

రామ జన్మభూమి అయోధ్య నుంచి సీతామాత జన్మస్థలం జనక్‌పూర్‌కు వెళ్లాలనుకునేవారిక

వారణాసిలో తొలి హైడ్రోజన్‌ క్రూయిజ్‌

ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో దేశంలోనే తొలి హైడ్

యూపీలో వరదలు.. 500 ఇళ్లలోకి సరయూ నీరు

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో సరయూ నది వరదల కారణంగా వందలాది గ్రామాలు

పూజా ఖేడ్కర్‌ తర్వాత మరో ఐఏఎస్‌.. వివాదాల్లో బ్యూరోక్రాట్లు!

దేశంలో బ్యూరోక్రాట్స్‌ నియామకంపై వరుస వివాదాలు తెరపైకి వస్తున్నాయి.

గుజరాత్‌ సీఎంకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు

ప్రధాని నరేంద్ర మోదీ నేడు (సోమవారం) గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు జ

International View all
ట్రంప్‌పై దాడి.. రీగన్‌ను గుర్తుచేసుకున్న కుమార్తె

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై జరిగిన దాడి ప్రపంచవ్యాప్తంగా చర

గాజా: స్కూల్‌పై ఇజ్రాయెల్‌ దాడి.. 15 మంది మృతి

గాజా: పాలస్తీనాలోని గాజా పట్టణంలో ఉన్న స్కూళ్లపై ఇజ్రాయెల్‌

ట్రంప్‌పై కాల్పులకు తెగబడింది ఈ యువకుడే.. ఫొటో విడుదల చేసిన ఎఫ్‌బీఐ

వాషింగ్టన్ డీసీ :  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట

సోమాలియాలో బాంబు పేలుడు.. ఐదుగురి మృతి

మొగదీషు: సోమాలియా రాజధాని మొగదీషులోని రద్దీగా ఉండే ఓ కేఫ్‌​

‘మివాకీ’ కన్వెన్షన్‌కు ట్రంప్‌.. అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించనున్న రిపబ్లికన్‌ పార్టీ

వాషింగ్టన్‌: కాల్పుల తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు  డొ

NRI View all
విదేశీ వర్కర్ల భద్రతకు మరిన్ని కఠిన నిర్ణయాలు

కెనడా ప్రభుత్వం తమ దేశంలో పనిచేసే విదేశీ వర్కర్ల రక్షణకు చర్యలు తీసుకుంటుంది.

ఇటలీలో బానిసత్వం!.. 33 మంది భారతీయ కార్మికుల విముక్తి

రోమ్‌: భారతీయ వ్యవసాయ కార్మికులను బానిస వ్యవస్థ నుంచి కాపాడి

టాక్‌ ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా బోనాల వేడుకలు

లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర

Video: భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా శివాని ప్రమాణం

భారత సంతతికి చెందిన 29 ఏళ్ల శివాని రాజా యూకే పార్ల‌మెంటులో హిందువుల పవిత్ర‌గ్రంథం భ‌గ‌వ‌ద్గీత సాక్షిగా ఎంపీగా ప్ర‌మాణ స్

45 కిలోలు తగ్గిన భారత సంతతి సీఈవో..అతడి హెల్త్‌ సీక్రెట్‌ ఇదే..!

బరువు తగ్గడం అనేది శారీరక శ్రమకు మించిన కష్టమైన ప్రక్రియ.

Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all