పలు చిత్రాల్లోనూ... వెబ్ సిరీస్‌ల్లోనూ కథానాయకుడిగానూ, కీలక పాత్రల్లోనూ నటించి టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చైతన్యరావు. ఒకవైపు హీరోగా నటిస్తూనే..మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఆ మధ్య రిలీజైన అనుష్క ‘ఘాటీ’ సినిమాలో విలన్గానూ నటించి మెప్పించాడు. త్వరలోనే ఈ విలక్షణ నటుడు మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
కె.క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘దిల్ దియా’. ‘ఏ నేక్డ్ ట్రూత్’ అనేది ట్యాగ్ లైన్. శ్రియాస్ చిత్రాస్, ఎ పూర్ణ నాయుడు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై పూర్ణ నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కిస్తున్నాడు) విడుదల చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.
ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను గమనిస్తే..దుస్తులు లేకుండా సొఫాలో కూర్చున్న చైతన్య రావును చూడొచ్చు. తను రగ్డ్ లుక్‌తో స్క్రీన్‌ను సీరియస్‌గా చూస్తున్నాడు. వెనుక నుంచి ప్రొజెక్టర్ లైటింగ్ వస్తోంది. తన చూపుల్లోని ఇంటెన్సిటీ తన పాత్రలోని సీరియస్‌నెస్‌ను తెలియజేస్తోంది. కథలోని విషయాలను రివీల్ చేయకుండా , పాత్రలు వాటికి కావాల్సిన నిజాన్ని వెతుక్కుంటూ సాగే కథగా ఈ సినిమా ఉంటుందనే ఫీల్ కలుగుతుంది
ఈ సందర్భంగా... చిత్ర నిర్మాత పూర్ణ నాయుడు మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్స్, సెన్సిబుల్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు క్రాంతి మాధవ్‌గారు.. మరోసారి ‘దిల్ దియా’తో సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించటానికి సిద్ధమవుతున్నారు. చైతన్యరావు మదాడిని న్యూ అవతార్‌లో చూడబోతున్నారు. రా ఎమోషన్స్‌ను అందరికీ కనెక్ట్ అయ్యేలా రూపొందిస్తున్నాం. ప్రేమ, మమకారం, వైఫల్యం, స్వీయ గౌరవం వంటి ఎలిమెంట్స్‌ను సినిమాటిక్ లాంగ్వేజ్‌లో దర్శకుడు ఆవిష్కరిస్తున్నారు. ‘దిల్ దియా’ను సమ్మర్‌లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. చైతన్యరావు మాదాడి, ఇరా, సఖి, జెస్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రంలో మణి చందన, ప్రమోదిని, వీర శంకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Here’s the first look poster of my dear friend's @bykranthi 5th film 🔥
WISHING YOU ALL THE LUCK 🤗
CONGRATULATIONS 🎊 Poster is very intriguing and deep 🤝#DILDIYA @IamChaitanyarao @bykranthi @Ira_dayanand @PoornaNaiduProd @phanikalyang @pgvinda @beyondmediapres… pic.twitter.com/4YrwlglagQ— Sandeep Reddy Vanga (@imvangasandeep) January 3, 2026


