స్వయంభూ కోసం స్వారీ | Sakshi
Sakshi News home page

స్వయంభూ కోసం స్వారీ

Published Mon, Feb 12 2024 1:45 AM

Samyuktha Menon Masters Horse Riding for Swayambhu - Sakshi

సవాల్‌ చేసే పాత్ర రావాలే కానీ ఎంత కష్టమైనా పడటానికి రెడీ అంటున్నారు సంయుక్తా మీనన్‌. ఆమెకు ‘స్వయంభూ’ సినిమా సవాల్‌ విసిరింది. నిఖిల్‌ హీరోగా భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో ఠాగూర్‌ మధు సమర్పణలో భువన్, శ్రీకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పాన్‌ ఇండియా మూవీలో సంయుక్తా మీనన్‌ కథానాయిక. ఈ చిత్రంలో చేస్తున్న ఓ లెజెండ్రీ యోధుడి పాత్ర కోసం నిఖిల్‌ ప్రత్యేకమైన ఆయుధాలు, మార్షల్‌ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నారు.

భారీ యుద్ధ సన్నివేశాలు ఉన్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్‌ కూడా పోరాట సన్నివేశాలు చేయాల్సి ఉంటుంది. ఈ స్టంట్స్‌ చేయడానికి గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు సంయుక్తా మీనన్‌.  ‘‘స్వయంభూ’ కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నా. ఇదొక అద్భుతమైన ప్రయాణం’’ అన్నారు సంయుక్త. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ప్రస్తుతం నిఖిల్, ఇతర తారాగణం పాల్గొనగా ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement