Samyuktha Menon Got Offer In Trivikram Srinivas Movie - Sakshi
Sakshi News home page

Samyuktha Menon : హీరోయిన్‌ సంయుక్తా మీనన్‌కు ఛాన్స్‌ ఇచ్చిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌!

May 4 2023 3:49 PM | Updated on May 4 2023 4:31 PM

Samyuktha Menon Got Offer In Trivikram Srinivas Movie - Sakshi

ఇప్పటికే తెలుగులో ఆమె నటించిన భీమ్లా నాయక్‌, బింబిసార, సార్‌, విరూపాక్ష హిట్‌ అవ్వడంతో సంయుక్తకు గెల్డెన్‌ లెగ్‌ అనే పేరుంది.

మలయాళ భామ సంయుక్తా మీనన్‌కు తెలుగులో సూపర్‌ క్రేజ్‌ ఉంది. భీమ్లా నాయక్‌తో టాలీవుడ్‌కు పరిచమైన ఈ భామ వరుస హిట్స్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే తెలుగులో ఆమె నటించిన భీమ్లా నాయక్‌, బింబిసార, సార్‌, విరూపాక్ష హిట్‌ అవ్వడంతో సంయుక్తకు గెల్డెన్‌ లెగ్‌ అనే పేరుంది.

దీంతో తెలుగులో సంయుక్తా మీనన్‌ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిపోయింది. దీంతో ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ అవకాశాన్ని దక్కించుకుందట ఈ మల్లు బ్యూటీ. అ‍ల్లు అర్జున్‌ పుష్ప షూటింగ్‌ అనంతరం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: వెకేషన్‌లో దిల్ రాజు కుమార్తె.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!

ఈ సినిమాలో బన్నీకి జోడీగా సంయుక్తను ఫిక్స్‌ చేశారట డైరెక్టర్‌ త్రివిక్రమ్‌. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానున్నట్లు ఫిల్మీదునియాలో జోరుగా ప్రచారం జరగుతుంది. ఈ క్రమంలో మరోసారి త్రివిక్రమ్‌-సంయుక్తా మీనన్‌ల రిలేషన్‌పై నెట్టింట పుకార్లు మరోసారి తెరమీదకి వచ్చాయి.
చదవండి: టార్చర్‌.. రోజూ కొట్టేవాడు, పార్కింగ్‌ ప్లేస్‌లో పడుకునేదాన్ని: నటి

Advertisement
 
Advertisement
Advertisement